ఇదేంటి టైటిల్ లో తెలుగుకి తెగులు పట్టింది అనుకుంటున్నారా.. సాధారణ టైటిలే నండీ...కాస్త సంస్కృతం టచ్ ఇచ్చాం. ఇంతకీ విషయం ఏమిటంటే.. మన తెలుగు సినిమాలు విడుదలకు ముందు ప్రేక్షకులకు చేరువవడంలో టైటిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అటువంటి మూవీ టైటిల్స్ లో హీరో పేరు గనుక ఇమిడివుంటే ఆ సినిమా కాస్తా ఫ్లాప్ గా మారుతుందని టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండింగ్ సెంటిమెంట్.
భారీ అంచనాల మధ్య నాగార్జున తనయుడు నటించిన 'అఖిల్' సినిమా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమాలో హీరో అయిన అఖిల్ పేరునే సినిమాకి పెట్టడం వలనే ఈ పరిస్థితి అన్న వాదనలు లేకపోలేదు. ఇది కేవలం ఈ యువ హీరోకే కాదు. బిగ్ 4 సైతం ఎదుర్కున్న సందర్భమే. చిరంజీవి జై చిరంజీవ - నాగార్జునకి కెప్టెన్ నాగార్జున - వెంకీ కి నమో వెంకటేశ - కృష్ణ కి భలే కృష్ణుడు - తారక రాముడికి రామయ్యా వస్తావయ్యా - మంచు విష్ణు కి విష్ణు - మహేష్ కి నాని ఇలా తమ పేర్లతో సంబంధమున్న సినిమాలన్నీ నిరాశ కలిగించడం విశేషం.
అయితే ఈ నేమ్ టైటిల్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన వారూ లేకపోలేదు. అడవి రాముడు - డ్రైవర్ రాముడు అంటూ సీనియర్ తారక రాముడు తన పేరుతొ బ్లాక్ బస్టర్ లు సాధించాడు. అల్లు అర్జున్ సైతం తన ముద్దు పేరు బన్నీతో హిట్ కొట్టాడు. ఏదైనా సెంటిమెంట్ వున్న దర్శకులు - నటులు ఈ విషయంపై ఓ లుక్కేస్తే మంచిది మరి.