మన దగ్గర ఏదైనా పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అదనంగా ఒక షో వేసుకోవడానికి అనుమతుల కోసం నానా కష్టాలు పడుతుంటారు నిర్మాతలు. ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం సులువుగానే పర్మిషన్లు వస్తాయి కానీ.. తెలంగాణలో కష్టమే. ఐతే తమిళనాట మాత్రం సినిమాలకు ఇలాంటి అనుమతులు ఈజీగా వచ్చేస్తుంటాయి. అక్కడ మీడియం రేంజి సినిమాలకు కూడా తెల్లవారుజామున నుంచే స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు ఇస్తుంటారు. ఇప్పుడు సినిమా వాళ్లు మరింత సంతోషించే నిర్ణయం తీసుకుందట తమిళనాడు ప్రభుత్వం.
తమిళనాట 24 గంటలూ థియేటర్లను ఓపెన్ గా ఉంచబోతున్నారట. ప్రతి రోజూ ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలూ కావాలంటే అన్ని షోలు వేసుకునే వీలు కల్పిస్తున్నారట. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. త్వరలోనే ఈ మేరకు జీవో జారీ చేయనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ఇకపై స్పెషల్ షోల కోసం అనుమతుల కోసం తమిళ నిర్మాతలు విజ్నప్తులు చేసుకోవడం.. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూడటం లాంటిదేమీ ఉండదు. ఏ సినిమాకైనా గరిష్టంగా ఆరు షోల వరకు వేసుకోవచ్చు. ఐతే అన్ని చిత్రాలకూ ఈ అవసరం ఉండదు. నాలుగు షోలు నడవడమే కష్టం. పెద్ద స్టార్ల సినిమాలు రిలీజైనపుడు మాత్రం ఈ సౌలభ్యం బాగా కలిసొస్తుంది. తొలి వారంలో నిర్విరామంగా షోలు వేసుకుని వసూళ్లు పెంచుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం పట్ల కోలీవుడ్ లో పూర్తి హర్షం వ్యక్తమవుతోంది.