టాలీవుడ్ ఏజ్ ఎంత ఇప్పటికి? .. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే తొలి తెలుగు సినిమా (టాకీ) పురుడుపోసుకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? అన్నది తెలియాలి. అంతకుముందే అసలు తొలి తెలుగు టాకీ టైటిల్ ఏది? అన్నది క్లారిటీ ఉండాలి. ఇంతకీ మన మేధావులు వెంటనే సమాధానమివ్వగలరా? అంటే కాస్త ఆలోచించాలి.
తొలి తెలుగు టాకీ - భక్త ప్రహ్లాద రిలీజై నేటికి 89 సంవత్సరాలు అయ్యింది. 02 ఫిబ్రవరి 1932లో ఈ మూవీ రిలీజైంది. అమరుడు సినీమేధావి హెచ్ .యం.రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భక్త ప్రహ్లాద మన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది.
భారత్ మూవీ టోన్ పేరిట శ్రీకృష్ణా ఫిల్మ్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది. అణా కానీలు చెలామణిలో ఉన్న అప్పట్లోనే 18 వేల రూపాయల పెట్టుబడితో 18 రోజుల్లో అంతా మన తెలుగు నటీనటులతో బొంబాయి లో చిత్రీకరణ జరుపుకొని బొంబాయి లోనే సెన్సార్ పూర్తి చేసుకుని (సెన్సార్ సర్టిఫికెట్ నంబర్ 11032 ) బొంబాయి లోని కృష్ణా సినిమా ధియేటర్ లో 1932 ఫిబ్రవరి 6 న ఈ చిత్రం విడుదలయింది. ఆ తర్వాత విజయవాడ- రాజమండ్రి తదితర కేంద్రాలలో విడుదలయింది.
అది పది రీళ్ల సినిమా... నిడివి పరంగా చెప్పాలంటే 9628 అడుగుల సినిమా. అలా 89 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న మన తెలుగు సినిమా యింకో 11 ఏళ్లలో అంటే..2032లో వందేళ్ల మైలు రాయిని చేరుకోబోతుంది! 06-02-2032 తేదీని ఇప్పటికే ఫిక్స్ చేసుకునే అరుదైన అవకాశం టాలీవుడ్ కి కలిగింది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈ నెల (ఫిబ్రవరి) 6న ఫిల్మ్ ఛాంబర్ భవనం లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాలులో కళా మంజూష - నేస్తం ఫౌండేషన్- తెలుగు సినిమా వేదిక ల ఆధ్వర్యాన `తెలుగు సినిమా తల్లి పుట్టిన రోజు పండగ`ను జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలంతా ఆహ్వానితులే. పరిశ్రమ 24 శాఖల ప్రముఖులతో పాటు జర్నలిస్టుల్ని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. సినీ పెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఈ వేడుకలు జరుగుతాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక భారతీయ సినిమా ఇప్పటికే వందేళ్ల సంబరాలు జరుపుకుంది. టాలీవుడ్ వందేళ్లు పూర్తి చేసుకోవడానికే 2032 వరకూ వేచి చూడాలన్నమాట.