టాలీవుడ్ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు నర్సింగ్ యాదవ్.
కాగా ఈ సందర్భంగా.. నటుడు నర్సింగ్ యాదవ్ భార్య మాట్లాడుతూ.. నా భర్త సాయంత్రం 4 గంటలకు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. దీంతో వెంటనే మేము సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము. అనుకోకుండా కోమాలోకి వెళ్ళారు. 48 గంటల పాటు డాక్టర్లు అబ్జర్ వేషన్ లో ఉంచాలన్నారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుంది.
కాగా ఇంట్లో కింద పడిపోయాడని.. తలకి గాయం అయ్యిందని.. వస్తున్న వార్తలు అవాస్తవం. తను ఎక్కడా పడిపోలేదు. ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయారు. కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండని ఆమె అన్నారు.
మైలా నరసింహ యాదవ్ ని.. ఇండస్ట్రీలో అందరూ నరసింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్ లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర - కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్ గా - విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు - హిందీ - తమిళ్ భాషల్లో నటించారు. రజనీకాంత్ నటించిన భాషాలోనూ మంచి క్యారెక్టర్ చేశారు.
అలాగే విజయనిర్మల దర్శకత్వం వహించిన ‘హేమాహేమీలు’తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. క్షణక్షణం - గాయం - ముఠామేస్త్రీ - మాస్ - శంకర్ దాదా ఎంబీబీయస్ - అనుకోకుండా ఒక రోజు - నువ్వొస్తానంటే నేనొద్దంటానా - రేసుగుర్రం - పిల్ల జమీందార్ - సుడిగాడు - కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన క్యారెక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది.
ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’లోనూ నటించారు. గత కొంతకాలంగా ఆయన డయాలిసిస్ చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు వున్నట్టుండి కోమాలోకి వెళ్లారు నర్సింగ్ యాదవ్. వెంటనే ఆయన్ని యశోద ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.