2018 కి సెండాఫ్ చెప్పి, 2019కి వెల్ కం చెప్పే టైమ్ ఇది. ఈ ఏడాది కూడా యథావిధిగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొన్ని పరాజయాలు, మరికొన్ని బ్లాక్‌బస్టర్లు- యావరేజ్ లు అంటూ సమీక్షలు వెలువడుతున్నాయి. అయితే బ్లాక్ బస్టర్ సినిమాల జాబితా పరిశీలిస్తే... వీటి విజయాల్లో కథానాయికల పాత్ర విస్మరించలేనిది. ఈ ఏడాది టాప్ ప్లేస్‌ని అలంకరించిన సినిమాల విజయాల్లో కథానాయికల పాత్రను కచ్ఛితంగా గుర్తు చేసుకోవాల్సిందే. ఆ జాబితాని పరిశీలిస్తే అందులో కీర్తి సురేష్- సమంత- పూజా హెగ్డే- రాశీ ఖన్నా- అదితీరావ్ హైదరీ- మాళవిక నాయిర్ వంటి నాయికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. నవతరంలో రష్మిక మందన- పాయల్ రాజ్‌పుత్- ప్రియాంక జవాల్కర్ వంటి భామలు అనూహ్యంగా వెలుగులోకి వచ్చారు.
`మహానటి` చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అభినయానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు నీరాజనాలు పలికారు. సావిత్రికి కీర్తి తప్ప వేరొక ఆప్షన్ లేదన్న ప్రశంసా దక్కింది. అలాగే పందెంకోడి 2- సర్కార్ వంటి చిత్రాలతో కీర్తి బ్లాక్‌బస్టర్లు అందుకుంది. అక్కినేని కోడలు సమంత మూడు సినిమాల్లో నటించింది. రంగస్థలంలో రామలక్ష్మిగా పల్లె పట్టు అభిసారికగా అద్భుతంగా రాణించింది. `మహానటి`లో అమాయక జర్నలిస్టు మధురవాణిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. యూటర్న్ లాంటి థ్రిల్లర్ మూవీలోనూ మైమరిపించే నటనతో మెరిపించింది. ముంబై భామ పూజా హెగ్డే అరవింద సమేత కథను నడిపించే నాయికగా ఆకట్టుకునే నటనాభినయం కనబరిచింది. అదితీ రావ్ హైదరీ నవాబ్- సమ్మోహనం వంటి చిత్రాలతో మెప్పించింది. వరుణ్ తేజ్ అంతరిక్షం చిత్రంలోనూ వ్యోమగామిగా అదితీ నటనకు పేరొచ్చింది. ఇంటెలిజెంట్- అంతరిక్షం- ముద్ర చిత్రాల్లో నటించింది లావణ్య త్రిపాఠి. హిట్టు రాకపోయిన తన పేరు మాత్రం ఫిలింనగర్ సర్కిల్స్ లో మార్మోగుతోంది. తొలి ప్రేమ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాశీఖన్నా 2018లో నాలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మరో మూడు చిత్రాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. మాళవిక నాయిర్ ట్యాక్సీవాలా చిత్రంలో నటించి మెప్పించింది. ఈ అమ్మడు పొరుగు భాషల్లోనూ మెప్పిస్తోంది.
నవతరం నాయికల్లో రష్మిక పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. సెన్సేషనల్ హిట్టు ఓవైపు, లవ్ బ్రేకప్- అభిమానులతో వివాదాలు మరోవైపు ఈ అమ్మడిని పాపులర్ చేశాయి. ఈ భామ ఒకే ఏడాదిలో వరుస హిట్లలో నటించి హాట్ టాపిక్ అయ్యింది. గీతగోవిందం- ఛలో- దేవదాస్ వంటి బ్లాక్‌బస్టర్లలో నటించింది. ఆర్.ఎక్స్ 100 చిత్రంలో డేరింగ్ బోల్డ్ యాక్టింగ్ తో కుర్రకారును ఆకర్షించిన పాయల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా చిత్రంతో విజయం అందుకుంది. `ఎక్కడికి పోతావు చిన్నవాడా?` చిత్రంతో బ్లాక్ బస్టర్లు అందుకున్న నందిత శ్వేత ఈ ఏడాది ఏకంగా డజను సినిమాలకు కమిటైందన్న ప్రచారం సాగుతోంది. ఇలా పలువురు నాయికలు చక్కని ప్రతిభతో కెరీర్ బండిని పరుగులు పెట్టించడం హాట్ టాపిక్.