టాలీవుడ్ లో షూటింగ్ ల బంద్ పలు విమర్శలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. సొంత వర్గం నిర్మాతలే షూటింగ్ ల బంద్ పై పెదవి విరుస్తున్నారు. ఇద్దరు ప్రొడ్యూసర్లు మాత్రం తమవి తమిళ సినిమాలంటూ షూటింగ్ లు చేసుకుంటున్నారని, మిగతా వారిని మాత్రం తెలుగు సినిమాలు అంటూ ఆపేయాలని చెబుతున్నారని.. ఈ డబుల్ స్టాండ్ ఏంటని మండి పడుతున్నారు. గిల్డ్, నిర్మాతల మండలి, తెలంగాణ ఫిలింఛాంబర్ అంతా ఒకటే అంటూ మరి వేరు కుంపట్లు ఎందుకని మండిపడుతున్నారు.
గిల్డ్ బంద్ పై స్టార్ ప్రొడ్యూసర్లు సి. అశ్వనీదత్, బవండ్ల గణేష్ బాహాటంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీళ్ల తరహాలోనే సీనియర్ స్టార్ హీరో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఆయ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. ఎన్ బికె 107 అనే వర్కిగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కర్నూలు లోని కొండారెడ్డి బురుజు సమీపంలో జరిగింది. అక్కడ పలు కీలక ఘట్టాల చిత్రీకరణ జరుపుకుంది.
ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ అటాక్ పేరుతో విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే గిల్డ్ బంద్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య కొంత అసహనానికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ మూవీ తరువాత వెంటనే బాలయ్య .. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీతో పాటు త్వరలోనే ఎన్ బీకె అన్ స్టాపబుల్ సీజ్ 2 ప్రారంభం కాబోతోంది. ఈ రెండింటి షెడ్యూల్స్ డిస్ట్రబ్ కాకూడదంటే మైత్రీ వారి సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగకూడదు.
కానీ గిల్డ్ స్ట్రైక్ కారణంగా ఆగింది. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 9 లోగా తిరిగి షూటింగ్ ని మొదలు పెట్టాల్సిందేనని బాలయ్య నిర్మాతలకు సీరియస్ గా చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య తాజా నిర్ణయంతో షూటింగ్ ల బంద్ కు పిలుపు నిచ్చిన నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. బంద్ గురించి ఎంతగా వివరించాలని నిర్మాతలు ప్రయత్నించినా బాలయ్య పెద్దగా పట్టించుకునే స్థితిలో లేరని అంటున్నారు.
అంతే కాకుండా బాలయ్యకు ఎదురు చెప్పేంద ధైర్యం కూడా ఏ ప్రొడ్యూసర్ చేయడానికి సుముఖంగా లేకపోవడం గమనార్హం. బాలయ్య తాజా నిర్ణయం నేపథ్యంలో మైత్రీ వారు ఎలా స్పందిస్తారన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. నిర్మాతల కోసం బంద్ పాటిస్తారా? బాలయ్య కోసం సెట్ లోకి అడుగుపెడతారా అన్నది వేచి చూడాల్సిందే.