టాలీవుడ్ లో స్టార్ లెందరో. నాయకానాయికలంతా నిత్యం షూటింగులతో బిజీ. మనకి ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి వాళ్లు ఎంటర్ టైన్ మెంట్ మిస్సవుతుంటారు. అయితే వీళ్లందరికీ కొన్ని ఎంటర్ టైనింగ్ హాబిట్స్ ఉన్నాయండోయ్.. వాటి గురించే ఈ డీటెయిల్స్...
మహేష్ :
చిన్నప్పుడు నాన్నగారితో పాటు ఆన్ సెట్స్ వెళ్లేవాడు. అక్కడ సెట్ లో క్రికెట్ ఆడుకునే వాడు. టీవీ చూడడం అంటే మహేష్ కి బాగా ఇష్టం. రేతిరంతా టీవీ చూస్తూనే కూచునే అలవాటుంది. ఇప్పుడు ఆ అలవాటు మానుకున్నారు. సాధ్యమైనంత వరకూ గౌతమ్ తో కలిసి వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అలాగే ఆధ్యాత్మికతపై పుస్తకాలు చదివే అలవాటుంది. ఇవన్నీ మహేష్ ని ఎంటర్ టైన్ చేసేవే.
పవన్ కల్యాణ్:
పవన్ హాబిట్స్ కాస్త డిఫరెంట్. ఇతడు అందరిలాగా కాదు. తనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఒకవేళ స్టార్ అవ్వకపోయి ఉంటే సొంతంగా నర్సరీ పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాడినని చెబుతుంటారు. అందుకేనేమో హైదరాబాద్ శివారులో అతడి ఫామ్ హౌస్ లో పళ్ల చెట్టను పెంచి వాటి పండ్లను ప్రతియేటా స్నేహితులకు పంపిస్తుంటారు.
అనుష్క, హన్సిక:
స్వీటీకి ఖాళీ సమయం చిక్కితే చాలు నాలెజ్ పెంచుకునే పనులు చేస్తుంటుంది. నిత్యం దినపత్రికల్లో వచ్చిన కొన్ని వార్తల్ని కటింగ్ చేసుకుని దాచి పెట్టుకుంటుంది. తీరిక చిక్కినప్పుడు ఆ వార్త చదువుకుని విజ్ఞానం పెంచుకుంటుంది. ఇక హన్సిక పుస్తకాల పురుగు. రాబిన్ హుడ్, చేతన్ భగత్ పుస్తకాల్ని బాగా చదువుతుంది. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్ని సేకరిస్తుంటుంది. 1000 వరకూ తన లైబ్రరీలో పుస్తకాలున్నాయి.
ప్రభాస్ :
ఫుట్ బాల్ ఆడడం అంటే ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో చివరి పీరియడ్ కోసమే మిగతా పీరియడ్స్ ఎటెండ్ చేసేవాడు. అంత ఇష్టం. ఆ తర్వాత వ్యవసాయం, రొయ్యల చెరువుల్ని పోషించడం అన్నా ఇష్టం. చిన్నప్పుడు ఆ పనులన్నీ చేశాడు. ఇప్పుడు స్పోర్ట్స్ కార్ లో శికార్లు చేయడం అంటే చాలా మక్కువ.
చరణ్:
మేలు జాతి అరేబియన్ గుర్రాల్ని కొనడం, వాటిని పోషించడం చరణ్ కి ఇష్టం. గుర్రపు స్వారీ అంటే ఇష్టం కాబట్టి .. ఇలా చేస్తుంటాడు. అలాగే మార్కెట్ లోకి కొత్త కార్ ఏది వచ్చినా వెంటనే చరణ్ ఇంటిముందు ఆగాల్సిందే. పెట్స్, కుక్కపిల్లలు అన్నా ప్రాణం. ఇటీవలే ఉపాసన తనకి ఓ కుక్కపిల్లని కానుకగా ఇచ్చింది.
బన్ని:
కబడ్డీ, పెయింటింగ్, డ్యాన్సింగ్ హాబిట్స్ . ఒకవేళ హీరో కాకపోయి ఉంటే కొరియోగ్రాఫర్ అయ్యేవాడినని చెబుతుంటాడు.
అఖిల్ క్రికెటర్ అయ్యుండేవాడు, గోపీ చంద్ బైక్ రైడర్ అయ్యుండేవాడు. అల్లరి నరేష్, వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్స్. సాయిధరమ్ క్రికెట్ ప్లేయర్, సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఇదీ మన హీరోల వ్యాపకాలు, హ్యాబిట్స్.