ఆ వ‌సూళ్లు కేర‌ళ‌కే డొనేష‌న్‌

Update: 2018-08-17 01:30 GMT
గ‌త కొద్దిరోజులుగా కేర‌ళ వ్యాప్తంగా వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు న‌గ‌రాల్లో ల‌క్ష‌ల్లో జ‌నం నిరాశ్ర‌యుల‌య్యారు. జ‌న‌జీవ‌నం స్థంభించింది. దీంతో అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల నుంచి పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు స్పందించి విరివిగా విరాళాలు ప్ర‌క‌టించారు. టాలీవుడ్ - కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు భారీ మొత్తాల్ని విరాళంగా ప్ర‌క‌టించి ధాతృహృద‌యాన్ని చాటుకున్నారు.

తొలిగా కోలీవుడ్ హీరో విశాల్ స్పందించి.. కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌కు నిత్యావ‌స‌రాల్ని స‌ర‌ఫ‌రా చేశాడు. పెద్ద ఎత్తున వాటిని జ‌నం నుంచి అభిమానుల నుంచి సేక‌రించి కేర‌ళ‌కు పంపించాడు. ఆ త‌ర్వాత బ్ర‌ద‌ర్స్ సూర్య - కార్తీ సంయుక్తంగా 25ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే అల్లు అర్జున్‌ - క‌మ‌ల్‌ హాస‌న్‌ - రామ్‌ చ‌ర‌ణ్ భారీ మొత్తంలో విరాళాల్ని కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల కోసం ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్ కోటి ప్ర‌క‌టించి కేర‌ళ అభిమానుల గుండెల్ని ట‌చ్ చేశాడు.

ఇప్పుడు బ‌న్ని స్నేహితుడు - నిర్మాత‌ బ‌న్నివాసు వంతు వ‌చ్చింది. నిన్న రిలీజై బంప‌ర్‌ హిట్ కొట్టిన `గీత గోవిందం` కేర‌ళ‌లోనూ భారీగా రిలీజై విజ‌యం సాధించింది. అక్క‌డ సాధించిన వ‌సూళ్ల‌న్నిటినీ వ‌ర‌ద‌బాధితుల‌కే ఇచ్చేస్తున్నామ‌ని బ‌న్ని వాసు ప్ర‌క‌టించారు. గీత గోవిందం దాదాపు 16కోట్ల మేర థియేట్రిక‌ల్ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో స‌గం వ‌సూళ్లు ఇప్ప‌టికే వ‌చ్చేశాయి. దేవ‌ర‌కొండ కెరీర్‌ లో ఈ  చిత్రం 50 కోట్ల క్ల‌బ్ సినిమాగా నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News