టాలీవుడ్ జనాల హిపోక్రసీ పీక్స్.. అంతే

Update: 2018-06-14 17:30 GMT
కొన్ని విషయాలను చెప్పడం చాలా తేలిక. చేయడం మాత్రం చాలా కష్టం. కానీ జనాలకు నీతులు చెప్పి..  ఉపన్యాసాలు ఇచ్చేసి.. రియల్ లైఫ్ లో వాటికి విభిన్నంగా ప్రవర్తించే వారు ప్రతీ చోటా ఉంటారు. టాలీవుడ్ లో ఇలాంటి కౌంట్ కాసింత ఎక్కువే కనిపిస్తుంది.

దేశభక్తి.. తెలుగు గొప్పదనం.. ఇలాంటి ఊకదంపుడు మాటలు ఎంతమంది తెలుగు సెలబ్రిటీల నోటి వెంట విని ఉంటాం. ఓ సారి ఆలోచిస్తే.. దాదాపుగా అందరూ ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్లే కనిపిస్తారు. మరి వీరంతా వారి పిల్లలను ఇండియన్ స్కూల్స్ చదివిస్తారా.. తెలుగు చదువులు చెప్పిస్తారా అంటే.. అబ్బే అలాంటి ఆనవాళ్లు మచ్చుతునకలు మాత్రమే కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఒట్టి పేర్లు మాత్రమే కాదు.. నిజంగానే ఫారిన్ యూనివర్సిటీల సిలబస్ లు ఫాలో అయ్యే స్కూల్స్ హైద్రాబాద్ లో కొన్ని ఉన్నాయి. వీటిలో అమెరికన్.. కేంబ్రిడ్జ్ వంటి సిలబస్ మాత్రమే ఉంటుంది.

అనేక మంది తెలుగు సెలబ్రిటీల పిల్లలు.. స్టార్ల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారి చిన్నారులు ఈ స్కూల్స్ లోనే చదువుతున్నారు. అంటే.. వీరిలో ఒక్కరికి కూడా వారు పెరుగుతున్న సమయంలో ఇండియా గురించి ఒక్క అక్షరం ముక్క కూడా తెలిసే అవకాశం లేదు. అలాగే.. చదువు ఓ స్థాయికి రాగానే అమెరికా జంప్ అయిపోతారు. అక్కడ అవీ ఇవీ నేర్చుకుని వచ్చి మళ్లీ ఇక్కడ హీరోలుగా సెటిల్ అయేవరకూ మనల్ని రుద్దతూ ఉంటారు. మరి టాలీవుడ్ గొప్పదనం గురించి.. దేశభక్తి గురించి.. తెలుగుదనం గురించి చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాల సంగతేంటో ఎవరికీ అర్ధం కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత తరంతో పోల్చితే.. ఇప్పుడు ఇలాంటి హిపోక్రసీ పీక్ స్టేజ్ కి చేరిపోయింది. 
Tags:    

Similar News