దేవిశ్రీ ప్రసాద్ తండ్రి - ప్రముఖ రచయితే సత్యమూర్తి స్వర్గస్తులయిన విషయం తెలిసిందే. చెన్నైలో సత్యమూర్తిని కడసారి చూసేందుకు.. కోలీవుడ్ అంతా తరలివచ్చింది. అయితే.. ఈ విషాద సందర్భంలో టాలీవుడ్ స్టార్స్ ఎవరూ కనిపించలేదు. ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.. చెన్నై వెళ్లి దేవిశ్రీ ప్రసాద్ ను పరామర్శించారు. మిగిలిన స్టార్స్ లో ఎవరూ కనిపించలేదు. కనీసం చివరి చూపు చూసేందుకు కూడా రాలేదు.
అంతా ఫోన్ లో తమ పరామర్శలు చెప్పి ఉండొచ్చు.. కానీ ఇలాంటి విషాద సమయంలో మనిషి తోడుకు మించిన అండ మరొకటి ఉండదు. దేవితో పెద్ద పెద్ద హిట్లు కొట్టించుకున్న స్టార్లందరూ హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారు. ఏమైపోయారు వీరంతా ఏమైపోయారు? కనీసం ఎందుకు చెన్నై వెళ్లలేదు అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎనర్జీకి మారుపేరు. ఏ ఫంక్షన్ లో అయినా దేవి ఉన్నాడంటే.. ఇక అక్కడ పండుగ వాతావరణమే. ఏ హీరో.. ఏ వంశం.. చిన్న పెద్ద.. స్టార్ - చిన్న హీరో వంటి తేడాలు లేకుండా సంగీతం ఇచ్చి.. తన మ్యూజిక్ ఇచ్చే మ్యాజిక్ తోనే సినిమాని సగం హిట్ చేసేస్తాడు. అందుకే దేవి ఈజ్ లైక్ మై బ్రో... అని చాలా మంది స్టార్లు చెబుతుంటారు.
కానీ ఇప్పుడు మాత్రం వీరిలో ఒక్కరు కూడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. హైద్రాబాద్ లో ఏదైనా జరిగితే నలుగురూ హాజరవుతారు. ఇప్పుడు చెన్నై కష్టంలో ఉంది. దేవిశ్రీకి అంతకంటే పెద్ద కష్టం వచ్చింది. అంతటి ఎనర్జిటిక్ పర్సన్ కూడా కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. మరి ఫంక్షన్లలో నా బ్రదర్ అంటూ ఊదరగొట్టే స్టార్లు.. ఇలాంటి సందర్భాలకు కూడా హాజరయ్యుంటే.. వారి వ్యక్తిత్వానికి మరో మణిహారంగా ఉండేది. అందరూ దేవికి హ్యాండిచ్చేయడం మాత్రం బాధాకరమే.