ఆ దర్శకులపై ఇండస్ట్రీ జాలి పడదే

Update: 2017-12-06 23:30 GMT
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది. తామే ప్రతిభావంతులం అని తెగ ఫీలయిపోయే కొంతమంది.. ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోరు. ఆ సమయానికి నోటికొచ్చినదంతా మాట్లాడేసి.. ఆ తర్వాత దాని ఫలితాన్ని తీరిగ్గా అనుభవించాల్సిన పరిస్థితి తెచ్చుకుంటూ ఉంటారు.

రైటర్ నుంచి దర్శకత్వంలోకి అడుగుపెట్టిన ఓ డైరెక్టర్ రూపొందించిన సినిమా.. రీసెంట్ గా రిలీజ్ అయింది. కంటెంట్ బాగుందనే టాక్ వచ్చినా.. ఈ చిత్రం పైరసీ బారిన పడింది. ఇది సినిమా కలెక్షన్స్ పై గట్టిగానే ప్రభావం చూపింది. అయితే.. ఈయనపై ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా జాలి చూపించకపోవడం.. ఆ సినిమాకు సపోర్ట్ గా నిలవడం లాంటివి ఎవరూ చేయకపోవడం ఆశ్చర్యకరం. ఈయనను ఇలా నెగ్లెక్ట్ చేయడంపై బయటి జనాలు ఆశ్చర్యపోవాలి కానీ.. ఇండస్ట్రీ వాళ్లకు అసలు రీజన్ బాగానే తెలుసు. వీకెండ్ పార్టీలలో.. ఆయా వ్యక్తులపై.. కొత్త రిలీజ్ లు.. వాటి మేకింగ్ లపై ఓపెన్ గానే విమర్శలు చేస్తుంటాడు ఈ రైటర్ కం డైరెక్టర్.

ఈయనకు తోడు మరో డైరెక్టర్ సిట్యుయేషన్ కూడా అదే. ఓ స్టార్ హీరోకి దశాబ్దం తర్వాత బ్లాక్ బస్టర్ అందించి టాప్ లీగ్ డైరెక్టర్ అనిపించుకున్నా.. ఆ క్రేజ్ కంటిన్యూ లేకపోయిన ఓ దర్శకుడిని కూడా ఇండస్ట్రీ ఇలాగే ట్రీట్ చేస్తోంది. ఇందుకు కారణం కూడా ఆ నోటి దురుసే అంటున్నారు. అందుకే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అవి కచ్చితంగా ఎదురుదాడి చేస్తాయి. ఇతరులంతా సైలెంట్ గా ఉంటేనే ఇలాంటి పరిస్థితి అంటే.. వీరి సిట్యుయేషన్ ను బేస్ చేసుకుని వాళ్లు ఎదురుదాడి చేస్తే?
Tags:    

Similar News