ఇది టైమ్‌ కాదు.. కాని చెప్పాల్సిందే

Update: 2015-10-12 01:30 GMT
కొన్ని కొన్ని మాటలు కాస్త సూటిగానే ఉంటాయి.. కాని ఒక్కోసారి వినక తప్పదు. ఇప్పుడు మనోరమ డెత్ న్యూస్‌ తరువాత చోటుచేసుకున్న పరిణామాలు కూడా తెలుగు ఇండస్ర్టీలో పెదవి విరుపులుకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే.. అప్పట్లో మనోళ్ళు కొంతమంది పెద్దోళ్లు తుది ప్రయాణం చేసినపుడు ప్రవర్తించిన తీరు.. అంత విసిగించేసింది.

తమిళ ఇండస్ర్టీ సీనియర్‌ మనోరమ చనిపోగా.. ఆమె పార్దివ దేహాన్ని ఆఖరిసారి దర్శించుకోవడానికి అనేకమంది తమిళ పెద్దలు విచ్చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ నుండి విజయ్‌ కాంత్‌ వరకు.. ఇళయరాజా నుండి విజయ్‌ వరకు.. అందరూ దర్శించుకున్నారు. అయితే ఇదే సీన్‌ మనం తెలుగులో కొందరు పెద్దల విషయంలో మిస్సయ్యాం అనే విషయం చాలామందికి గుర్తుంది. ఆ మధ్యన ఒక మనిషి అస్తమిస్తే.. అసలు పార్దివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌ లో పెట్టాలా లేకపోతే ఇంకెక్కడైనా పెట్టాలా అంటూ మనోళ్లు అర్ధంలేని డిస్కషన్లు పెట్టేశారు. కొందరు దిగ్గజాలను పక్కనెడితే.. మిగిలిన సెలబ్రిటీలను మాత్రం కాస్త పట్టించుకోలేదు అనే అపవాద తెలుగు సినిమాల నేల మోస్తోంది మరి.

వారెవ్వరో చనిపోతే బాగా సాగనంపారు.. మీరు మాత్రం చేయలేదు అనే ఆరోపణ చేయట్లేదు కాని.. అసలు మనం కూడా కొన్ని విషయాల్లో పాటాలు నేర్చుకోవాలి కదా?
Tags:    

Similar News