డ్రగ్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. డ్రగ్స్ రాకెట్లో కొంత మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారంలో తనకు నోటీసు అందిందని హీరో నవదీప్ తెలిపారు. అయితే, తను ఏ తప్పు చేయలేదన్నారు. డ్రగ్స్ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆ జాబితాలో ఉన్న కొంత మంది హీరోలు చెబుతున్నారు. మీడియాలో తమ పేర్లు రావడం వల్ల తమ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు.
డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. తనకు నోటీసులు వచ్చిన మాట నిజమేనని, పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, అకారణంగా మీడియాలో ఊహాగానాలు వ్యాప్తిచేయడం బాధాకమని అన్నారు. ఆ కెల్విన్ ఎవరో నాకు నిజంగానే తనకు తెలియదన్నారు. ఇటీవల ఓ రాంగ్ ఈవెంట్ మేనేజ్ మెంట్ తో కలిసి పని చేయడం వల్లే తనను పిలిచి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ఆ మేనేజ్ మెంట్ వారి వద్ద నా ఫోన్ నెంబర్ ఉండటంతో కేసు గురించి ప్రశ్నించేందుకు తనను పిలిచి ఉండవచ్చన్నారు.
కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడం బాధాకరమని యువ హీరో తనీష్ అన్నారు. ఇటువంటి వార్తలు తన కెరీర్ పై ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన చిత్రం టీజర్ లాంచ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, ఆ జాబితాలో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. మీడియాలో తన పేరు రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఒక వేళ నోటీసులు వచ్చి అధికారులు పిలిస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. దయతమ పేర్లను మీడియాలో ప్రచారం
తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదని హీరో నందు తెలిపారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓ చానెల్ తో మాట్లాడిన ఆయన నిజానిజాలను మీడియా వెలికి తీయాలని కోరారు.
ఈ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అన్నారు. టీవీల్లో తన పేరు చూసి షాక్ కు గురయ్యానని, డ్రగ్స్ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పారు. తనకు ఎలాంటి అలవాట్లు లేవని, డ్రగ్స్ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.