స్టార్ హీరోలు చెబితే జనాలు చూస్తారా!

Update: 2017-08-03 07:16 GMT
సినిమాలో కంటెంట్ ఉంటే చాలు అదే చాలా వరకు థియేటర్లకి జనాల్ని లాక్కొచ్చేస్తుంది. కథలో జనాల్ని ఎట్రాక్ట్ చేసే రెండు మూడు సన్నివేశాల్సి ప్రచార చిత్రాలుగా రెడీ చేసి ప్రసార మాధ్యమాల్లో విడుదల చేస్తే చాలు ప్రచారంలో సగానికి పైగా పని పూర్తి అయినట్లే. మిగిలి ఉన్న ప్రచారాన్ని గోడ పోస్టర్లు - పేపర్ యాడ్లు - మిగిలిన డిజిటల్ మాధ్యమాల్లో ఆ సినిమా పై వచ్చే కథనాలు పూర్తి చేస్తాయి. అయితే తెర పై కనిపించే తారలు - స్టూడియోలు వదిలి ఆడియెన్స్ లోకి వచ్చి మరీ తమ సినిమా ప్రచారాన్ని చేయడం వినూత్నమైన పద్ధతి అనుకుంటే, వాటి నుంచి పుట్టుకొచ్చినవే ఆడియో ఫంక్షన్లు - ప్రీ రిలీజ్ ఫంక్షన్లు తదితర హంగామా ఈవెంట్లు.

అయితే స్టార్ హీరోల సినిమాలకే పరిమతయ్యే ఈ మెగా ఈవెంట్లు ఇప్పుడు చిన్న సినిమా వాళ్లు ఫాలో అవుతున్నారు. పబ్లిసిటీకి సరైన బడ్జెట్ కూడా కేటాయించలేని కొందరు చిన్న సినిమా నిర్మాతలు ఆడియో ఫంక్షన్లు - ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రం ఓ రేంజ్ లో ఏర్పాటు చేసి దానికి స్టార్ హీరోల్ని గెస్టులుగా పిలుస్తున్నారు.

ఇలా చేస్తే ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చిన హీరోగారి ఫ్యాన్స్ తమ సినిమా చూస్తారనే ఆశ. ఇదే రీతిన త్వరలో విడుదల కాబోతున్న ఓ చిన్న సినిమా నిర్మాత రెండు మూడు ఈవెంట్లు ప్లాన్ చేసి దానికి తనకున్న పలుకుబడితో స్టార్ హీరోల్ని అతిధులుగా ఆహ్వానించాడు. ఆ దర్శకనిర్మాత పై ఉన్న గౌవరంతో ఆ స్టార్ హీరోలు వచ్చి సినిమాని, ఆ దర్శకుడిని తెగ పొగిడారు. ఇంతవరకు బాగానే ఉంది, అయితే ఫంక్షన్ కి వచ్చిన ఆ స్టార్ హీరోల మాటల్నే టీజర్లుగా కట్ చేసి ప్రసార మాధ్యమాల్లోకి విడుదల చేశాడు ఆ నిర్మాత. సినిమాలో ఉన్న కంటెంట్ ని ప్రచారం చేయకుండా, ఫంక్షన్ కి వచ్చిన స్టార్ హీరోల మాటల్ని ప్రచారం చేయడం సినిమాకి ఆశించినంత స్థాయిలో ఉపయోగపడకపోవచ్చని సినీజనాలు అంటున్నారు. మరి ఆ దర్శకనిర్మాత వేసిన ప్రచార ఎత్తుగడ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News