సినిమా పరిశ్రమలో బండ్లు ఓడు - ఓడలు బండ్లు అవ్వడం అనే సామెత ప్రత్యేక్షంగా చూస్తూ ఉంటాం. ఒక్క సినిమాతో స్టార్ డం దక్కించుకున్న స్టార్స్ ను చూశాం - ఒక్క ఫ్లాప్ తో స్టార్ డంను కోల్పోయిన వారిని చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక దర్శకుడు తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో విఫలం అయ్యాడు. చిన్న చిత్రాలతో కెరీర్ ను ఆరంభించిన ఆ దర్శకుడు ఒక బడా హీరోతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తెరకెక్కించడంతో ఒక్కసారిగా ఆయనతో స్టార్ హీరో సినిమాలు చేయాలని ఆశ పడ్డారు.
ఆ బడా హీరోతో చేసిన సినిమా సక్సెస్ తర్వాత వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. పెద్ద హీరోలతో చేసినా కూడా ఆ దర్శకుడు సక్సెస్ లు దక్కించుకోలేక పోయాడు. స్టార్ హీరోతో చేసిన ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే ఆ దర్శకుడికి మరో అవకాశం రావడం కష్టం. కాని ఆ దర్శకుడికి మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు పడ్డా పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కింది. అదృష్టం బాగున్నా కూడా ఆయన దాన్ని వినియోగించుకోలేక పోయాడు.
తాజాగా కూడా ఒక చిత్రాన్ని తెరకెక్కించిన ఆ దర్శకుడు మరో సారి నిరాశ పర్చాడు. తాజా చిత్రం కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇక ఆ దర్శకుడికి ఛాన్స్ రావడం కష్టమే అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనతో సినిమా అంటేనే నిర్మాణ సంస్థలు జంకుతున్నాయి. ఫ్లాప్ ల్లో ఉన్న ఆ దర్శకుడు కాస్త తగ్గి చిన్న బడ్జెట్ చేస్తే పోయేది. కాని వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేసి నిర్మాతల నెత్తిన బండ వేసినట్లుగా చేశాడు. తాజా చిత్రంతో నిర్మాతలు భారీగా నష్టపోయారట.
ఇకపై అయినా చిన్న చిత్రాలను - లో బడ్జెట్ చిత్రాలను చేస్తే ఆయన కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశం ఉంది. కాని ఆయనకు మాత్రం ఎక్కడో ఈగో అడ్డు వస్తుందో లేదా మరేంటో కాని చిన్న చిత్రాల జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పెద్ద సినిమాలే చేస్తా అంటే ఆ దర్శకుడి కథ కంచికే అనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.