వాళ్ళు కూడా సుకుమార్ ని ఫాలో అయితే??

Update: 2015-11-30 19:30 GMT
ఒక సన్నివేశాన్ని కుదిరినంత రేంజ్ లో క్రియేటీవ్ గా రాసుకోవడం సుకుమార్ స్పెషాలిటీ. వరుస విజయాలతో టాప్ పొజిషన్ కి వెళ్ళిపోయిన సుకుమార్ ఓ రెండు మూడు మెట్లు దిగి చిన్న హీరోలతో సినిమాలు తీయడం అంటే కాస్త కష్టమే. ఈ నెపంతో ఇప్పటికే చాలామంది పెద్ద పెద్ద దర్శకులు తమకొచ్చిన అద్భుతమైన కధలను సైతం వదిలేసుకుంటున్నారు. అయితే సుకుమార్ మాత్రం అలా వదలకుండా తానే రచన/ నిర్మాతగా మారి కుమారి 21F ని తెరకెక్కించి విజయం సాధించాడు.

కుమారితో టాలీవుడ్ లో ఒక కొత్త ఊపు వచ్చింది. రచనలో తలపండి డైరెక్టర్ ల కుర్చిలోనుండి బయటపడలేకపోతున్న పెద్ద దర్శకులకు చిన్న దారి కనబడింది. తామే రచయితలుగా మారి చిన్న సినిమాలను నిర్మిస్తే హిట్ తధ్యమని అర్ధమవుతుంది. ఈ క్రమంలో మన టాలీవుడ్ బడా దర్శకులు అడుగులు వేస్తే బాగుంటుంది కదూ..

కామెడీ రైటింగ్ మరియు టైమింగ్ లతో అదరగొట్టే శ్రీనువైట్ల నానికోసం ఒక కధ రాస్కుంటే ఎంత బాగుంటుంది, త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కోసం ప్రాస డైలాగులతో స్టోరీ కూర్చీ నిర్మించడం సాధ్యంకాని పనా? అలానే మారుతి అల్లరి నరేష్ కి, పూరి శర్వానంద్ కి రచయితలుగా చేయూతనిస్తే అటు వారికి ఇటు వీరికి మంచి బ్రేక్ రాదంటారా??
Tags:    

Similar News