స్టార్లే కాదు.. దర్శకులూ లైన్ పెంచేస్తున్నారే

Update: 2017-01-08 01:30 GMT
ఇతర సినీ ఇండస్ట్రీల మాదిరిగా కాకుండా.. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో ఒకసారి ఒక సినిమా మాత్రమే చేయడం అనే కల్చర్ ఉంది. గతేడాది వరకూ ఇదే కంటిన్యూ అయింది. బడా స్టార్లంతా తాము చేస్తున్న మూవీ కంప్లీట్ అయ్యి.. రిలీజ్ అయ్యి.. రిజల్ట్ తెలిశాక మాత్రమే నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించేవారు. ఇప్పుడా ట్రెండ్ లో చేంజ్ వచ్చింది. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. లాంటి స్టార్ హీరోలంతా రెండేసి మూడేసి సినిమాలు ఒకేసారి సైన్ చేసినట్లు చెప్పేశారు.

టాప్ డైరెక్టర్ల వరస కూడా ఒకసారి ఒకటే అనే లెక్కలోనే ఉంటుంది. ఫలానా దర్శకుడు తర్వాత ఏ హీరోతో చేస్తాడనేది పెద్ద సస్పెన్స్ వ్యవహారం. హీరోల రూట్ లో డైరెక్టర్లు కూడా ఒకేసారి ఎక్కువ ప్రాజెక్టులు ఒప్పేసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఇంకా మొదలుపెట్టకుండానే.. తర్వాతి మూవీ ఎన్టీఆర్ తో అనే అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నానని మహేష్ స్వయంగా చెప్పేశాడు. అంటే మాంత్రికుడు మూడు సినిమాలు లైన్లో పెట్టాడన్న మాట.

మూడే సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిపోయిన కొరటాల శివ కూడా ఇప్పుడు రూట్ మార్చాడు. తన తర్వాతి మూవీ మహేష్ బాబుతో చేయనుండగా.. 'భరత్ అను నేను'(ఫైనల్ కాలేదు) అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇది పూర్తి కాగానే.. రామ్ చరణ్ తో మూవీ చేయబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఉంది. స్టార్ హీరోలు.. పెద్ద డైరక్టర్లు రెండు మూడు ప్రాజెక్టులకు ముందస్తుగానే అగ్రిమెంట్స్ చేసుకోవడం.. టాలీవుడ్ లో ఒక మంచి మార్పుగా చెప్పచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News