ట్రైలర్ కట్ చేస్తే అందులో ఒక పంచ్ డైలాగ్ పడాల్సిందే. లేదంటే సినిమాలో ఏమి లేదని ఫీలింగ్ వచ్చేసే ఛాన్స్ వుంది. అందుకనే ఈ మధ్య సినిమాలేకాదు ట్రైలర్ లు కూడా రొటీన్ గా నే ఫార్ములాకి తగ్గట్టుసాగుతున్నాయి. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఒకటే తీరుని కొనసాగించడం కాస్త బాధాకరం..
హీరో ఇంట్రడక్షన్ షాట్.. హీరోయిన్ ఒంపుసొంపుల షాట్... ఒక పాట బిట్.. ఒక ఫైట్ లో చేసిన కట్.. చేజ్ లో చిన్న ముక్క... కామెడీ వుందని మరో పక్క... చివరి విలన్ తో పంచ్ డైలాగ్.. అరచేతిలో అద్భుతాన్ని చూపించినట్టు మా సినిమాలో నవరసాలకు కొదవలేదని 2నిముషాల నిడివిగల ట్రైలర్ లో ఇరికించే తాపత్రయమే ఇదంతా.. ఇటీవల విడుదలైన బ్రూస్ లీ - అఖిల్ - షేర్ సినిమాల ట్రైలర్ లు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ట్రైలర్ లు కట్ చెయ్యడంలో పూరిది భిన్నమైన శైలి.. రాజమౌళి 'సై' సినిమా ట్రైలర్ లో డైలాగులే వుండవు... రవిబాబు కూడా ట్రైలర్ లలో కొత్తదనం ట్రై చేసిన సంఘటనలు తెలిసినవే.ఇలా తాము తీసిన సినిమాలలోనే తమకే తెలియని కొత్త యాస్పెక్ట్ లతో ట్రైలర్ కట్ చేయడం ఒక విద్య.. దీన్ని మిగిలినవారంతా ఎప్పుడు అనుసరిస్తారో...