బాలీవుడ్ లో ఇప్పుడు సర్వత్రా.. ''ఘంటా అవార్డ్స్'' గురించి చర్చించుకుంటున్నారు. హాలీవుడ్ లో రాజీ అవార్డ్సు ఎలా ఇస్తారో.. బాలీవుడ్ లో ఈ సెటైరికల్ ''వరస్ట్'' అవార్డులను మొదలెట్టారు. చాలా పర్ఫెక్టుగా ఇలాంటి అవార్డులను దిగ్విజియంగా ఇచ్చేస్తున్నారు. వాటిల్ని అందుకోవడానికి సెలబ్రిటీలు రాకపోవచ్చు.. కాని జనాలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. మీడియాలో ఆ అవార్డుల గురించి ప్రస్తావన జరుగుతోంది.
గత ఏడాదికి గాను.. ప్రేమ్ రతన్ దన్ పాయో సినిమాకు వరస్ట్ మూవీ అని.. షారూక్ వరస్ట్ యాక్టర్.. సోనమ్ కపూర్ వరస్ట్ యాక్ర్టెస్.. అంటూ అవార్డులు ఇచ్చేశారు. మోహిత్ సూరి వంటి దర్శకులు అయితే.. వరస్ట్ డైరక్టర్ అవార్డుకు నామినేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ తమ సోషల్ పేజీల్లోనే రాసుకొచ్చారు కూడా. అయితే మన టాలీవుడ్ లో ఇలాంటి అవార్డులు ఇవ్వగలమా? పవన్ - మహేష్ - చరణ్ - ఎన్టీఆర్ వంటి స్టార్లను వరస్ట్ యాక్టర్లు అనగలమా? లేదంటే శ్రీను వైట్ల - సుకుమార్ వంటి డైరక్టర్లకు వరస్ట్ డైరక్టర్ అవార్డులు ఇచ్చుకోగలమా? ఈ చెత్త అవార్డులు మా హీరోకు ఇస్తారా అంటూ అభిమానులు రచ్చ చేసేస్తారు కదూ.
అంతే కాదు.. అసలు హీరోల వారీగా విడిపోయిన దాదాపు చాలా మీడియా సంస్థలు.. అసలు ఈ 'చెత్త' అవార్డుల గురించి ప్రకటనలు చేస్తాయా? యాడ్లు పోతాయేమో అని మెదలకుండా ఉండిపోతాయా? కాని రాజీస్.. ఘంటాస్.. వంటి అవార్డులు ఇస్తేనే.. స్టార్లకు కూడా వారు ఏం చేస్తున్నారో తెలుస్తుందని చాలామంది ఆడియన్స్ ఫీలింగ్.