టాలీవుడ్ ని రైటర్ల కొరత వేధిస్తోందా? సరిపడినంత స్టఫ్ లేదా? పెరిగిన మార్కెట్ రేంజుకి తగ్గట్టు అవసరాల్ని ఫుల్ ఫిల్ చేసేంతమంది రచయితలు లేరా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. డిమాండ్ కి తగ్గట్టు సప్లయ్ లేదన్న మాట నేరుగా సీనియర్ రచయితలే అనడం చూస్తుంటే సన్నివేశం అర్థం చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఉన్నా క్రియేటివ్ రైటర్ల కొరత మాత్రం వేధిస్తోంది. నవతరం ఎంతమంది వచ్చినా ఇంకా ఇంకా రిక్వయిర్ మెంట్ కనిపిస్తోంది.
పలువురు సీనియర్ రైటర్ల కొలువులో యువ రచయితలు పని చేస్తున్నా అవసరమైన క్రియేటివిటీ మాత్రం పరిమితంగానే ఉందన్న వాదనా వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిరంతరం క్వాలిటీ క్రియేటివ్ రచయితల కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. సత్యానంద్ లాంటి సీనియర్ రచయిత పరిమితంగానే సినిమాలకు రాస్తున్నారు. కోన వెంకట్ నిర్మాతగానూ డబుల్ రోల్ పోషిస్తూ బిజీ బిజీ. అలానే త్రివిక్రమ్ - కొరటాల శివ - వక్కంతం వంశీ - అనీల్ రావిపూడి - బాబి - మచ్చ రవి - అవసరాల శ్రీనివాస్ లాంటి మేటి రచయితలు దర్శకులుగా ప్రొఫెషన్ మార్చడంతో ఆ బ్లాంక్ స్పేస్ అలానే ఉండిపోయింది. క్వాలిటీ కథల్ని - స్క్రీన్ ప్లేని అందించే రచయితలు - అనుభవజ్ఞుల కొరత అయితే అలానే ఉంది. ఇక యువరచయితల్లో డైమండ్ రత్నం - శ్రీధర్ సీపాన వంటి వాళ్లు దర్శకులుగానే కెరీర్ ని సాగించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ పరిణామం ఓ కొత్త లూప్ హోల్ కి కారణమైంది.
ఇలా ప్రతిభావంతులు రచనకు దూరమవ్వడమో - లేక దర్శకులుగా ప్రాజెక్టులతో బిజీగా ఉండడమే కొత్త రచయితలకు అవకాశం కల్పిస్తోంది. అయితే ఇక్కడికి వచ్చే రచయితల్లో క్వాలిటీ - అనుభవం అన్నది మాత్రం పరిమితమేనన్న మాటా వినిపిస్తోంది. చందు మొండేటి - సుధీర్ వర్మ - అనీల్ రావిపూడి - సంకల్ప్ రెడ్డి వంటి నవతరం దర్శకులు కొంతవరకూ తమకు తామే కథల్ని రాసుకుని సినిమాని పట్టాలెక్కించే సత్తా ఉన్న వాళ్లు కాబట్టి ఇలాంటి వాళ్లకు పెద్దంతగా సమస్య ఉండకపోవచ్చు. కానీ కొందరు దర్శకులు కచ్ఛితంగా ఇతర రచయితలపై ఆధారపడి ఉండేవాళ్లు ఉన్నారు. అలాంటి వారికి క్వాలిటీ కథలు ఇచ్చే రచయితల కొరత ఉంది. పరుచూరి సోదరులు - విజయేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ రచయితలు అప్పుడప్పుడు ఔత్సాహిక రచయితల కోసం పార్ట్ టైమ్ కోర్సుల్ని అందిస్తూ నవతరాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్సాహం ఉన్నవాళ్లు రచయితల సంఘంతో టచ్ లో ఉండి కొంత నాలెడ్జి ని సంపాదించి కొలువుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా ఇంకా ఏదో వెలితి టాలీవుడ్ ని వేధిస్తోంది. ఇకపోతే ఓవైపు భారీ చిత్రాల నిర్మాణం పెరిగింది. చిన్న సినిమాల విస్త్రతి పెరుగుతోంది. వీటికి తోడు టీవీ సిరీస్ - వెబ్ సిరీస్ అంటూ బోలెడన్ని అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతుంటే అందుకు తగ్గట్టు రచయితలు మాత్రం పెరగడం లేదు. పుస్తకాలు - నవలలు చదివే విజ్ఞానం ఉన్న రచయితలు తగ్గి అశుకవిత్వాలు రాసే కొబ్బరి నూనె బ్యాచ్ లు కృష్ణానగర్ - ఫిలింనగర్ లో తయారవ్వడం కొంతవరకూ ఇబ్బందికరంగా మారిందన్న విమర్శ వినిపిస్తోంది.