కృష్ణ‌న‌గ‌ర్ - ఫిలింన‌గ‌ర్ కున్న దూరం 3 కిలోమీట‌ర్లే

Update: 2022-06-22 08:30 GMT
గ‌త రెండేళ్లుగా ఇండ‌స్ట్రీ క‌రోనా దెబ్బ‌తో విల విల లాడింది. షూటింగ్ లు లేవు.. రిలీజ్ లు లేవు. దీంతో సినీ కార్మికుల‌కు తిన‌డానికి తిండి లేని దుర్భ‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. ఇండ‌స్ట్రీ కార్మికుల్ని కాపాడు కోవ‌డానికి మెగాస్టార్ చిరంజీవి న‌డుం బిగించి సీసీఎల్ పేరుతో నిధులు స‌మీక‌రించి సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందేలా చూశారు. ప్ర‌తీ ఒక్క‌రికీ ప‌ని లేక‌పోయినా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అండ‌గా నిలుస్తూ వ‌చ్చారు. అయితే అనూహ్యంగా సినీ కార్మికులు బుధ‌వారం నుంచి షూటింగ్ ల బంద్ కు పిలునివ్వ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త కొంత కాలంగా క‌నీస వేత‌నాన్ని పెంచ‌డం లేద‌ని, ఈ విష‌యంపై ఫెడ‌రేష‌న్ దృష్టికి తీసుకెళ్లినా మాకు న్యాయం జర‌గ‌లేదంటూ 24 క్రాఫ్ట్ ల‌కు సంబంధించిన కార్మికులు బుధ‌వారం నుంచి మెరుపు స‌మ్మెకు నిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. కార్మికుల మెరుపు స‌మ్మె కార‌ణంగా చాలా వ‌ర‌కు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లు ఎఫెక్ట్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న ఓ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

ఈ మూవీ షూటింగ్ కి అంత‌రాయం ఏర్ప‌డిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ తో క‌లిసి చేస్తున్న సినిమాపై కూడా కార్మికుల స‌మ్మె తీవ్ర ప్ర‌భావాన్ని చూపించిన‌ట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా చాలా వ‌ర‌కు నిర్మాణంలో వున్న భారీ చిత్రాల‌కుపై కూడా ఈ స‌మ్మె ప్ర‌భావం చూపిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. అయితే నిర్మాత‌ల మండ‌లి మాత్రం షూటింగ్ ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది. ఏదైనా స‌మ్మె కు పిలుపినిచ్చిన‌ప్పుడు దానికి సంబందించిన 15 రోజుల ముందే సంబంధిత వ్య‌క్తుల‌కు తెలియ‌జేయాల్సి వుంటుంది.

కానీ సినీ కార్మికులు మాత్రం అలా చేయ‌కుండా ఉన్న‌ఫ‌లంగా స‌మ్మెకు దిగుతున్నామంటూ ప్ర‌క‌టించారు. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని నిర్మాత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. గ‌త రెండేళ్లుగా ఇండ‌స్ట్రీ తీవ్ర సంక్ష‌భాన్ని ఎదుర్కొంది. చాలా వ‌ర‌కు సినిమాల నిర్మాణం ఆల‌స్య‌మైంది. నిర్మాత‌లు కోట్ల‌ల్లో పెట్టుబ‌డుతు పెట్టి భారీగా వ‌డ్డీలు క‌ట్టారు.. ఇప్ప‌టికీ క‌డుతున్నారు. కార్మికుల మెరుపు స‌మ్మె కార‌ణంగా మారుతి డైరెక్ట్ చేసిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` పై కూడా ఎఫెక్ట్ ప‌డింది. అయితే ప్యాచ్ వ‌ర్క్ ని చెన్నైలో పూర్తి చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కార్మికుల స‌మ్మెపై స్పందించారు. తాజాగా ఓ వీడియోని విడుద‌ల చేశారు.

క‌రోనా కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ గ‌త మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంద‌ని, ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంద‌ని, అలాంటి స‌మ‌యంలో కార్మికులు స‌మ్మెబాట ప‌ట్ట‌డం స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. నిన్న‌టి నుంచి ఎక్క‌డ చూసినా సినిమా షూటింగ్ లు ఆగిపోతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. యూనియ‌న్ లు వేత‌నాలు పెంచ‌క‌పోవ‌డం వ‌ల్ల కార్మికులు షూటింగ్ లు ఆపేస్తామంటూ పోరాటం చేస్తున్నార‌ని తెలిసిందన్నారు.

అంద‌రికి మంచి జ‌రిగేలా సినీ పెద్ద‌లు మంచి నిర్ణ‌యం తీసుకుంటారు. క‌రోనా కార‌ణంగా గ‌త మూడేళ్లుగా ప్ర‌పంచంతో పాట సినీ ప‌రిశ్ర‌మ కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. కార్మికులు, చిన్న ఆర్టిస్ట్ లు తిన‌డానికి తిండిలేక నానా ఇబ్బందులు ప‌డ్డారు. వైద్యం చేయించుకోవ‌డానికి చాలా మంది డ‌బ్బులు లేక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పడిప్పుడే సినీ ప‌రిశ్ర‌మ ప్రాణం పోసుకుంటోంది. తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కు అంత‌టా మంచి పేరొస్తోంది. మ‌నంద‌రి బ్యాంకు ఖాతాలు డ‌బ్బుల‌తో నిండ‌క‌పోయినా మ‌న కంచాలు నిండుతున్నాయి. స‌మ్మె గురించి విని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు నాకు ఫోన్ లు చేస్తున్నారు. ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా నేను కోరేది ఒక్క‌టే.

నిర్మాత‌లు కూడా క‌రోనా కార‌ణంగా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారు. వ‌డ్డీలు క‌ట్ట‌లేని ప‌రిస్థితుల నుంచి ఇప్ప‌డిప్పుడే కోలుకుంటున్నారు.. స్థిర‌ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో తొంద‌ర ప‌డ‌కుండా కాస్త స‌మ‌యం తీసుకుని ఫెడ‌రేష‌న్, నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి రావ‌డం పెద్ద స‌మ‌స్యేమీ కాదు. కృష్ణ‌న‌గ‌ర్ - ఫిలింన‌గ‌ర్ కున్న దూరం 3 కిలోమీట‌ర్లే. అంద‌రం క‌లిస్తేనే కుటుంబం..అంద‌రం క‌లిసి ఓ ప‌రిష్క‌రిస్తాం. ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా ఏం చేయ‌డానికైనా సిద్ధంగా వున్నాను. పెద్ద‌లంద‌రం క‌లిసి సినీ ఇండ‌స్ట్రీ మ‌రోసారి అంధ‌కారంలోకి వెళ్ల‌కుండా నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌ని నా అభిప్రాయం` అన్నారు న‌రేష్‌. ఆయ‌న విడుద‌ల చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News