యూఎస్ బాక్సాఫీస్.. 1 మిలియన్ బూస్ట్

Update: 2022-08-22 04:19 GMT
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత వరుసగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. కంటెంట్ ఎంతో డిఫరెంట్ గా ఉంటేనే ఆడియోన్స్ థియేటర్లోకి వస్తున్నారు అని ఇటీవల వచ్చిన సినిమాలు చాలా క్లియర్ గా నిరూపించాయి. ఇక ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన సినిమాలుకు మంచి డిమాండ్ అయితే ఏర్పడుతొంది. గత రెండు మూడు నెలల కాలంలో అయితే యుఎస్ లో చాలా వరకు టాలీవుడ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది.

ఈ తరుణంలో రెండు విభిన్నమైన పైన సినిమాలో వన్ మిలియన్ డాలర్లు అందుకొని మళ్ళీ టాలీవుడ్కు సరికొత్త బూస్ట్ అయితే ఇచ్చాయి. ఇక అందులో సీతారామం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ పోయెట్రీ లవ్ స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి నిర్మతలకు ప్రాఫిట్ లోకి తీసుకువచ్చింది. ఇక యూఎస్ లో అయితే ఆదివారం రోజు కూడా కలెక్షన్స్ మరింత పెరగడం విశేషం మొత్తంగా. ఇప్పటివరకు సీతారామం సినిమా యూఎస్లో $1,222,217  [ 9 Cr 80 L] రాబట్టింది.

ఇక మరొకవైపు నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ సినిమా కూడా అదే తరహాలో మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఈ సినిమా మాత్రం జెట్ స్పీడ్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసుకునే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందిస్తోంది.

సెకండ్ వీక్ కూడా ఈ సినిమాకు సాలీడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆదివారం రోజు అయితే వన్ మిలియన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. అంటే దాదాపు 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

అలాగే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా కూడా అక్కడ మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇక వీటన్నిటిలో కేవలం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా మాత్రమే పట్టు సాధించలేకపోయింది. ఆ సినిమా రెండు మూడు రోజులకే యూఎస్ థియేటర్ల సంఖ్యను తగ్గించుకుంది. దీన్ని బట్టి కంటెంట్ బాగుంటే యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ కు మళ్ళీ పాత కళ వస్తుంది అని చెప్పవచ్చు. మరి రాబోయే సినిమాలు ఈ అడ్వాంటేజ్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటాయో చూడాలి.
Tags:    

Similar News