ఐదొందలు.. వెయ్యి నోట్ల రద్దు వ్యవహారం మహా రంజు సాగుతోంది. బ్లాక్ మనీ దాచుకున్నోళ్లంతా కిక్కురుమని అనలేకపోతున్నారు. ఇది టాలీవుడ్ లో చాలామందిపై గట్టి దెబ్బే వేసిందని కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితినే ఫేస్ చేసిన ఓ తెలుగు హీరో.. బంగారం లాంటి ఐడియా వేశాడట.
మోడీ నోట్ల రద్దు ప్రకటించే నాటికి ఈయన ఇంట్లో 5 కోట్ల రూపాయల క్యాష్ ఉందట. ఆ అమౌంట్ ను ఏం చేయాలనే విషయంపై ఒకట్రెండు రోజులు తీవ్రంగా ఆలోచించిన ఈయన.. తర్వాత తన పరిచయాలన్నీ ఉపయోగించి.. మొత్తాన్ని బంగారం బిస్కెట్లలోకి మార్చి పడేశాడట. ప్రస్తుతం బంగారం వ్యాపారులు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ తెలుగు హీరో కూడా మార్కెట్ రేటుకు కొంత ఎక్కువ పెట్టి మరీ గోల్డ్ బిస్కెట్ల రూపంలోకి మొత్తం ఐదు కోట్లను మార్చేశాడట.
ఆ తర్వాత తాపీగా వచ్చి మోడీ తీసుకున్న నిర్ణయం అదరహో అంటూ ప్రశంసలు కురిపించడం అసలు హైలైట్. ముందు ఇల్లు సర్దేసుకుని ఆ తర్వాత వచ్చి సమాజం గురించి మాట్లాడుతున్నాడంటూ పంచ్ డైలాగ్స్ ఈయన మీద పడుతున్నాయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/