ఒంట‌రి దీవిలో జంట షికార్లు అందుకేనా?

Update: 2022-10-11 02:30 GMT
ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో.. పాపుల‌ర్ హీరోయ‌న్ ప్ర‌స్తుతం ఒంట‌రిదీవుల‌కు జంట‌గా వెళ్లారు. విమానాశ్ర‌యంలో విడివిడిగా క‌నిపించి చివ‌రికి ఒకే స‌ముద్ర దీవికి వెళ్లారు. అక్క‌డ ఆ ఇద్ద‌రూ ఏం చేస్తున్నారో ఏమిటో అంటూ సందేహాలు రేకెత్తించే కొన్ని హింట్లు కూడా వ‌ద‌ల‌డంతో మీడియాలో నానా ర‌చ్చ‌వుతోంది.

ఇంత‌కుముందు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా- కియరా అద్వాణీ జంట ఇలానే మీడియాతో దోబూచులాడారు. వెళ్లేప్పుడు విమానాశ్ర‌యంలో విడివిడిగా క‌నిపించారు. తిరిగి వ‌చ్చేప్పుడు మాత్రం క‌లిసే వ‌చ్చారు. ఒంట‌రిదీవుల విహార‌యాత్ర‌నుంచి బోలెడ‌న్ని హింట్లు ఇచ్చారు. అది ముగించి స‌ర‌దాలు కానిచ్చి ఈ జంట తిరిగి వ‌చ్చింద‌ని బాలీవుడ్ మీడియా అంతా కోడై కూసింది. ఇప్పుడు తెలుగు హీరో హీరోయిన్ జంట‌పైనా అలాంటి పుకార్లే షికార్ చేస్తున్నాయి.

ఇంత‌కీ ఈ జంట ఇంత స‌డెన్ గా మాల్దీవుల‌కు ఎందుకు వెళ్లిన‌ట్టు? అంటే...బాధ‌ల‌న్నీ మ‌ర్చిపోయేందుకే! నంటూ జోకులు విసిరేస్తున్నారు కొంద‌రైతే. ఒక‌రు పాన్ ఇండియా హిట్టు అంటూ వేన‌వేల‌ ఆశ‌లతో సినిమాని రిలీజ్ చేస్తే డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ నైరాశ్యం మిగిల్చింది. ఇక క‌థానాయిక ప‌రిస్థితి ఇంచుమించు అంతే. తాను న‌టించిన తొలి హిందీ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో నీర‌సించింది.

ఇక అన్ని నీర‌సాల‌ను వ‌దిలించుకునేందుకు ఇప్పుడు ఒంట‌రిదీవుల్లో జంట విహారానికి వెళ్లారు! అంటూ ఒక‌టే లోకం కోడై కూస్తోంది. అయితే ఈ షికార్ల సంగ‌తి అటుంచితే ఈ జంట ఇప్ప‌టికైనా క‌థ‌ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని .. జంట షికార్ల కంటే కెరీర్ పైనే ఎక్కువ శ్ర‌ద్ధ పెట్టాల‌ని కూడా కొంద‌రు ఉచిత స‌ల‌హాలు ప‌డేస్తున్నారు!! ఒంట‌రి దీవిలో అన్నీ మ‌రిచిపోయేందుకు సేద దీరేందుకు వెళితే ఈ మీడియాలేంటి ఇలా షంటేస్తున్నాయ్! అంటూ ఒక సెక్ష‌న్ అభిమానులు ఎందుక‌నో క‌ల‌త చెందుతున్నారు సుమీ!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News