రూమర్లు ఎందుకని హీరోయిన్లను పిలవలేదు

Update: 2017-10-16 09:39 GMT

అతనో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గట్టిగా ఉన్న హీరో. ఆ అండతోనే బాగానే నిలదొక్కుకున్నాడు. దానికి తగ్గట్టే కష్టపడ్డాడు కూడా. అయితే మనోడు ఈ మద్యనే తన బర్తడే పార్టీని గ్రాండ్ గా జరుపుకున్నాడు. కాని అందరూ ఊహించినట్లు అక్కడ హీరోయిన్ కనిపించకపోయేసరికి.. ఒక్కసారిగా ఫిలిం ఇండస్ర్టీ అవాక్కయ్యింది.

నిజానికి ఇతగాడు గడిచిన రెండేళ్ళలో ఇచ్చిన బర్తడే పార్టీల్లో ఓ ఇద్దరు హీరోయిన్లు సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్ అయిపోయారు. అందులో ఒక హీరోయిన్ అతనికి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో వారి మధ్యన ఏదో మ్యాటర్ పరిగెత్తేస్తోందని రూమర్లు అనేకం వచ్చాయి. ఆ తరువాత ఇండస్ట్రీలో ఉన్న ఆమె స్నేహితులైన ఇతర హీరోయిన్లు కూడా ఆ పార్టీలకు వచ్చేవారు. కాని అలా వచ్చిన ప్రతీసారి జనాలు ఆ హీరోయిన్ల గురించి ఏదో ఒక రూమర్ చెప్పుకోవడం మన హీరోకు నచ్చలేదట. తన వలన అమ్మాయిలకు బ్యాడ్ నేమ్ వస్తోందని ఫీలై.. ఈసారి పార్టీకి వారిని పిలవలేదట.

మొత్తానికి తన కొలీగ్స్ గురించి ఇలా జాగ్రత్తగా థింక్ చేసినందుకు ఈ హీరోను ఇప్పుడు ఇతర హీరోలందరూ అభినందిస్తున్నారు. అది సంగతి.


Tags:    

Similar News