టాలీవుడ్‌ హీరోలు.. 100 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సినిమాలు..!

Update: 2022-05-10 10:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా  పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సర్కారువారి పాట'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ చేసిన ఈ చిత్రం.. అతి పెద్ద టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 'సర్కారు వారి పాట' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.125 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.100 కోట్లు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా హిట్ కొట్టాలంటే రూ.130 కోట్లకు పైగా థియేట్రికల్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది.

'సర్కారు వారి పాట' మహేష్ బాబు కెరీర్ లో 100+ కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఐదవ సినిమా. ఇంతకముందు మహేష్ నటించిన 'స్పైడర్' 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు విడుదలకు ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేశాయి. టాలీవుడ్ లో ఇన్ని వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చిత్రాలున్న మరో హీరో లేడనే చెప్పాలి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో తొలిసారిగా 100 కోట్లకు పైగా ప్రీ బిజినెస్ అందుకున్నాడు. ఇదే క్రమంలో వచ్చిన 'బాహుబలి 2' 'సాహో' 'రాధేశ్యామ్' వంటి సినిమాలు ప్రీ రిలీజ్ లో సత్తా చాటాయి. అంటే ప్రభాస్ కు నాలుగు వంద కోట్ల ప్రీ రిలీజ్ చేసిన సినిమాలున్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 'సైరా నరసింహా రెడ్డి' (పాన్ ఇండియా) మరియు 'ఆచార్య' సినిమాలు వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి' 'భీమ్లా నాయక్' వంటి రెండు సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. 'పుష్ప: ది రైజ్' వంటి పాన్ ఇండియా చిత్రంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తొలిసారిగా ఈ జాబితాలో చేరాడు.

RRR వంటి పాన్ ఇండియా సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కూడా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల లిస్టులో చేరారు. ప్రస్తుతానికైతే టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు 5 సినిమాలతో ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నారు. పాన్ ఇండియా మూవీ లేకుండానే మహేష్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం.
Tags:    

Similar News