టాలీవుడ్ మాసేసి రీమేక్ ఉడ్ అనాలి

Update: 2016-02-07 17:30 GMT
దేశీయ సినీ పరిశ్రమలో తెలుగు సినీ పరిశ్రమలో చాలా పేరుంది. బాలీవుడ్ తర్వాత అతి ఎక్కువగా సినిమాలు రిలీజ్ అయ్యేది తెలుగులోనే. కానీ ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందేమో అనుకోవాలి. అదేంటీ బాహుబలి - శ్రీమంతుడు తర్వాత మన ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చిందిగా అనుకోవచ్చు. కానీ వాటి తర్వాత అంత గొప్పగా కాన్సెప్ట్ లు లేకపోతే జనాలు తిరగ్గొడతారనే భయం మిగిలినవాళ్లలో ఎక్కువైపోయింది. అందుకే రిస్క్ తగ్గించేసుకుంటే సేఫ్ ప్రాజెక్టుల కోసం తహతహలాడుతున్నారు. అప్పటికే మొదలైపోయినవి తీసేశారు కానీ.. తర్వాత మాత్రం అందరూ పక్క భాషల వంకే చూస్తున్నారు

ముందుగా మెగాస్టార్ ఫ్యామిలీలో మెగాస్టార్ నుంచి స్టార్ట్ చేస్తే.. చిరు తన రీఎంట్రీ కోసం తమిళ కత్తిని ఎంచుకున్నారు. ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ కూడా కోలీవుడ్ నుంచి తనిఒరువన్ ని తెచ్చుకున్నాడు. ఇక ఇదే ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వేదాళం చిత్రాన్ని రీమేక్ చేస్తున్న వీషయం రీసెంట్ గానే ఫిక్స్ అయింది.

సోగ్గాడితో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున నెక్ట్స్ మూవీ ఊపిరి. ఇది ఫ్రెంచ్ మూవీ ఇన్ టచబుల్స్ ఆధారంగా తీసిన సినిమా. ఈయన కుమారుడు నాగ చైతన్య మళయాళ మూవీ ప్రేమమ్ ని రీమేక్ స్టార్ట్ చేసేశాడు. దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్ బాక్సింగ్ మూవీ సాలా ఖడూస్ రీమేక్ కి సెట్ అయ్యాడు. నారా వారబ్బాయి రోహిత్ మాన్ కరాటేని తెలుగులోకి తెస్తున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన స్పీడున్నోడు కూడా తమిళ మూవీ సుందరపాండియన్ కి రీమేకే.

ఇలాగే పరభాష మీద ఆధారపడుతూ వెళితే.. ఇక టాలీవుడ్ అనడం మానేసి రీమేక్ ఉడ్ అని పిలిపించుకునే రోజులు వస్తాయి.
Tags:    

Similar News