ఒక సినిమా నిర్మించాలి అంటే చాలా మంది కలిసి కష్టపడవలిసి ఉంటుంది. అంతలా కష్టపడిన సినిమాకు మంచి మార్కెట్ రేట్ వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అయి మంచి కలెక్షన్లు వస్తే నిర్మాతకు హీరోకు దర్శకుడు ఇలా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకీ తరవాత మంచి అవకాశాలు కూడా వస్తాయి. కానీ అదే సినిమాకు అవార్డులు ప్రేక్షకులు ప్రేమ ప్రశంసలు వస్తే ఆ నటుడుకి మంచి గౌరవం గుర్తింపు వస్తుంది.
ఇప్పుడు 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఇవ్వబోతున్నారు.ఈ సారి మన తెలుగు యంగ్ హీరోలు వాళ్ళ స్టైల్ లో వాళ్ళు విజృబించారు. ఎవరికి వారే ఒక ట్రెండ్ సెట్ చేశారు. అందరూ నటనలోను మంచి పరిణితి కనిపించింది. అలాగే అన్నీ కమర్షియల్ హిట్ కూడా అయ్యాయి. అందుకే వీళ్ళలో బెస్ట్ యాక్టర్ ట్రోఫీ ఎవరికి వస్తుంది అనేది సర్వత్రా సస్పెన్స్ లో పడింది.
ఎందుకంటే ఈసారి ఉత్తమ నటుడు కోసం నామినేషన్లు సాదాసీదాగా లేవు. అల్లు అర్జున్ - సరైనోడు, నాని - జెంటల్ మాన్, నాగ చైతన్య – ప్రేమమ్, నాగార్జున – ఊపిరి, ఎన్టీఆర్ – నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ – ధృవ ఉన్నాయి. అల్లు అర్జున్ చేసిన సీరియస్ నటన ప్రేక్షకులు చూసి బాగా మెచ్చుకున్నారు, నాని కూడా ద్విపాత్రా అభినయనం చేసి తన స్టైల్ హిట్ కొట్టి కూల్ గా అందరి మదిలో నిలిచిపోయాడు. నాగ చైతన్య క్లాసిక్ యాక్ట్ తో అందరికి మంచి కనువిందు చేశాడు. నాగార్జున తన కదలలేని కాళ్ళతో కదిలే కళ్ళతో అందరినీ కట్టిపారేశాడు. ఎన్టీఆర్ తనదైన స్టైల్ తో నట విశ్వరూపం చూపించాడు, రామ్ చరణ్ కూడా ఇప్పటి వరకు నేను వేరు ఇక నుండి మీరు చూడబోయే చరణ్ వేరు అని ధృవ సినిమాతో ఋజువు చేశాడు. ఇంత మంచి నటనను అందించిన మన తెలుగు హీరోలుకు ఎవరికి ఉత్తమ నటుడు ఇవ్వాలి అనేది కష్టమే కదా. అదే ఇబ్బంది ఏర్పడింది ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వాళ్ళికికూడా.
ప్రతిసారి ఎవరో ఒకరు అందరి కన్నా బాగా చేసి అటు ప్రేక్షకులు బాగా నచ్చింది జూరీ మెంబర్స్ మెచ్చింది తొందరగా తేలిపోయేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరూ ఇరగదీశారు నటనలో. మరి ఎవరు బ్లాక్ లేడిని ఇంటికి పట్టుకుపోతారో వేచి చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/