సినిమా తీయడం కంటే కూడా దాన్ని ప్రేక్షకులకు చేరువ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో ఫెయిలై కొన్ని మంచి సినిమాలు కూడా చరిత్రలో కలిసిపోయాయి. గత శుక్రవారం విడుదలైన ‘టెర్రర్’ కూడా అలాగే మరుగున పడిపోయేలా కనిపించింది. శ్రీకాంత్ గత చిత్రాల ఫలితాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే అతి కష్టం మీద సినిమాను విడుదల చేశాడు నిర్మాత. థియేటర్లు చాలా తక్కువగా దొరికాయి.
హైదరాబాద్ లాంటి సిటీలో మంచి ఏవో మూలన ఉన్న ఆరేడు థియేటర్లు మాత్రమే దక్కాయి. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, మౌత్ పబ్లిసిటీ కూడా తోడవడంతో జనాలకు సినిమా మీద కొంత ఆసక్తి మొదలైనప్పటికీ ‘టెర్రర్’ టీమ్ మాత్రం సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదు. మరోవైపు జనాలు సినిమా చూద్దామన్నా.. దగ్గర్లో ఉన్న థియేటర్లలో సినిమా లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టెర్రర్ అన్యాయమైపోయేలా కనిపించింది.
ఐతే మూడో రోజు నుంచి పరిస్థితి కొంచెం మెరుగైంది. కొన్ని మల్టీప్లెక్సుల్లో సినిమాకు స్క్రీన్లు ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లు కూడా కొన్ని యాడ్ అయ్యాయి. మరోవైపు తొలి మూడు రోజుల్లో పబ్లిసిటీ గురించే పట్టించుకోని చిత్ర బృందం కూడా నాలుగో రోజు కదిలింది. విడుదలకు ముందు, తర్వాత ఎక్కడా ప్రమోషన్లలో కనిపించని హీరో శ్రీకాంత్ - దర్శకుడు సతీష్ కాశెట్టి.. సోమవారం బయటికి వచ్చారు. నిర్మాతతో కలిసి థ్యాంక్స్ మీట్ పెట్టారు.
కృష్ణవంశీ - అల్లరి నరేష్ - సుధీర్ బాబు - బీవీఎస్ రవి లాంటి వాళ్లను పిలిచి వాళ్లకు స్పెషల్ షో వేసి.. వాళ్లతో మాట్లాడించారు. అందరూ సినిమా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడటంతో ‘టెర్రర్’ గురించి జనాలకు మరింతగా తెలిసింది. కలెక్షన్లు పుంజుకున్నాయి. రెండో వారం ఇప్పుడున్న థియేటర్లలో టెర్రర్ కంటిన్యూ అయితే నిర్మాత కొంత వరకు సేఫ్ అవ్వొచ్చు. థియేట్రికల్ కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చినా.. సినిమాకు మంచి టాక్ వచ్చింది కాబట్టి శాటిలైట్ కూడా కొంత వర్కవుటై.. పెట్టుబడి వెనక్కి రాబట్టుకునే అవకాశాలుంటాయి.