స్పెషల్‌ స్టోరీ: బొద్దే ముద్దు గురూ

Update: 2015-04-15 07:12 GMT
జీరో సైజ్‌ ట్రెండ్‌ కనుమరుగైపోయింది. బొద్దుగా ముద్దుగా కనిపించడమే నయా ట్రెండ్‌. టాలీవుడ్‌లో ఇప్పుడున్న సీనియర్‌ నాయికలు, జూనియర్‌ నాయికల తీరుతెన్నుల్ని పరిశీలిస్తే ఈ సంగతి ఇట్టే అర్థమైపోతోంది. సన్నజాజి తీగలా కనిపించడం కోసం తిండి కట్టేసుకోవాల్సిన పనేలేదిప్పుడు. నాయికలంతా సుష్టుగా తిని పుష్టిగా తయారవుతున్నారు.

ఆ కోవలో పరిశీలిస్తే అందాల అనుష్క, నయనతార, హన్సిక ఆరంభం నుంచి ఒకే లుక్‌ మెయింటెయిన్‌ చేశారు. రావడమే బొద్దుగుమ్మలుగానే వచ్చారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. స్వీటీ అలియాస్‌ అనుష్క వచ్చేప్పుడు కాస్త స్లిమ్ముగా కనిపించినా ఇప్పుడు మూడు పదుల వయసులో బొద్దుగానే కనిపిస్తోంది. అలాగే నయనతార రావడమే బొద్దుగుమ్మలా ఎంట్రీ ఇచ్చింది. శ్రీరామరాజ్యం కోసం కాసింత స్లిమ్మయినా తిరిగి మళ్లీ కండ పట్టించేసింది. అలాగే మలయాళ కుట్టి నిత్యామీనన్‌ ఆరంభం నుంచి ఒకే ఫిగర్‌ మెయింటెయిన్‌ చేస్తోంది. నేనే ఒక బ్రాండ్‌. నన్ను చూసి మిగతావాళ్లు తయారవ్వాల్సిందే అన్నంత కాన్ఫిడెంటుగా ఉంటుంది ఈ భామ.

అలాగే పాలబుగ్గల హన్సిక దేశముదురులో బొద్దుగుమ్మగానే కనిపించి ఆకట్టుకుంది. జాంపండులా ఉందే పిల్ల, సిమ్లా ఆపిల్‌లా ఊరిస్తుందే బుల్లి అంటూ కుర్రాళ్లంతా పరేషాన్‌ అయ్యారు. అందాల నాయిక తమన్నా ఆరంభం స్లిమ్ముగా కనిపించినా కాలక్రమంలో బొద్దెక్కింది. ఇప్పుడు యావరేజ్‌ ఫిగర్‌ మెయింటెయిన్‌ చేస్తోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మల్లో రాశిఖన్నా బొద్దందంతోనే మతి చెడగొడుతోంది. సన్నజాజి తీగలకు లేని క్రేజు ఈ అమ్మడికి ఉందంటే అతిశయోక్తి కాదు.

తెలుగింటి సీతమ్మగా అలరించిన అంజలి బొద్దుగుమ్మే. ఛార్మి, పూర్ణ ముద్దొచ్చే బొద్దుగుమ్మలే. అదే బాలీవుడ్‌కి వెళితే అక్కడ సోనాక్షి సిన్హా, పరిణీతి చోప్రా బొద్దుతనానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. బొద్దే ముద్దు. అందులోనే ఉంది కిక్కు.. అని అంటున్నారు. అదీ సంగతి.

Tags:    

Similar News