టాలీవుడ్ లో దేశ భక్తి ప్రధాన చిత్రాల వెల్లువ మొదలైంది. ఇటీవల విడుదలైన `ట్రిపుల్ ఆర్` పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఇదే కోవలో దేశ భక్తి ప్రధాన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. స్టైలిష్ లుక్ లక్, స్టైలిష్ హోయిర్ కట్ కు భిన్నంగా ఈ చిత్రాల్లో మన క్రేజీ స్టార్స్ పవర్ ఫుల్ సోల్జర్స్ గా కనిపించి కనువిందు చేయబోతున్నారు. స్టోరీ డిమాండ్ చేయడతంతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నారా అనేంతగా మన వాళ్లు టెర్రిఫిక్ మేకోవర్ తో సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ రేసులో ఎవరి బలా బలాలు ఎంత? ..ఈ రేసులో విన్నర్ అయ్యేది ఎవరన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
ఈ రేసులో అక్కినేని నాగచైతన్య నుంచి విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అఖిల్ అక్కినేని పోటీపడుతున్నారు. అయితే ముందు వరుసలో వున్న హీరో మాత్రం అక్కినేని నాగచైతన్య నే. గతంలో మేన మామ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన `వెంకీమామా`లో సోల్జర్ గా కనిపించిన చై ఈ సారి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా ఈ చిత్రాన్ని అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు.
సినిమాలోని ఓ కీలక ఘట్టంలో నాగచైతన్య, అమీర్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. ఓ వార్ ఎపిసోడ్ ని కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇది చైత హిందీలో నటించిన తొలి చిత్రం కావడం, పైగా అమీర్ ఖాన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. ఇదిలా వుంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో సోల్జర్ గా రాబోతున్నాడు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం `జేజీఎమ్`(జనగణమన). పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరపైకొచ్చిన ఈ మూవీ ఇటీవలే లాంఛనంగా ముంబైలో ప్రారంభమైంది. `ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్, ఇండియన్స్ కెన్ రూల్ దిల్ వరల్డ్ ..` అంటూ విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ లు సినిమా ఏ మోటోతో రూపొందుతోందో స్పష్టం చేస్తోంది. విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 3న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక ఈ మూవీ తరువాత వార్తల్లో నిలుస్తున్న చిత్రం `సీతారామం`. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కశ్మీర్ బోర్డర్ లో పని చేసే లెఫ్టినెంట్ గా దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారు. `రోజా` తరహా ఇండియా - పాకిస్టాన్ నేపథ్యంలో సాగే రైవల్రీ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఈమూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే వున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. `మహానటి` చిత్రంత తరువాత దుల్కర్ తెలుగులో నటిస్తున్న రెండవ చిత్రమిది.
ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే బాటలో అక్కినేని అఖిల్ కూడా స్పై థ్రిల్లర్ `ఏజెంట్` చిత్రంతో రాబోతున్నాడు. టెర్రరిస్ట్ లని ఏరిపారేసే స్పై పాత్రలో అఖిల్ నటిస్తున్న సినిమా ఇది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా దేశ భక్తి ప్రధానంగా సాగనుంది. ఇందులోని కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయబోతున్నారు. వెండితెరపై దేశ భక్తిని చూపించడానికి పవర్ ఫుల్ సోల్జర్స్ గా రాబోతున్న ఈ స్టార్ లలో ఎవరు ఏ స్థాయిలో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుని విజేతలుగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.