ఒకప్పుడు టాలీవుడ్ హీరో బాలీవుడ్ సినిమాలో కనిపించాడు అంటే అదో గొప్ప విషయం.. మన దర్శకుడు ఎవరైనా హిందీ లో సినిమా ను తీస్తే ఆహా ఓహో అనేవారు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్ లో మన హీరోలు ఆఫర్లు దక్కించుకోవడం కాదు... అక్కడి రికార్డులను కొల్లగొడుతున్నారు. మన దర్శకులు అక్కడ సినిమాలు చేయడం కాదు.. అక్కడి స్టార్ దర్శకులకు కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ఈమద్య కాలంలో తెలుగు సినిమాల దర్శకులు మరియు హీరోలు బాలీవుడ్ ప్రేక్షకులు తెగ నచ్చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ కు మరియు మీడియా వారికి మన వాళ్ళు నచ్చకున్నా కూడా ప్రేక్షకులకు నచ్చడంతో తప్పని పరిస్థితుల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మన స్టార్స్ తో సినిమా లు చేసేందుకు.. మన దర్శకులతో సినిమాలను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు.
అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కరణ్ జోహార్. ఈయన బాలీవుడ్ హీరోల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలను తీశాడు. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం కూడా సౌత్ హీరోలు మరియు దర్శకుల మీద ఉంది.
సౌత్ లో రూపొందుతున్న సినిమాలను హిందీలో విడుదల చేయడం మొదలుకుని సౌత్ స్టార్స్ ను హిందీ లో నటింపజేసే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ప్రస్తుతానికి టాలీవుడ్ లోనే పాన్ ఇండియా సినిమాలు అంటూ హీరోలు దర్శకులు సినిమాలు చేస్తున్నారు. కాని భవిష్యత్తులో హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు మన స్టార్స్ సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దేశం మొత్తం ఆధరణ ఉండే బాలీవుడ్ సినిమాల్లో నటించాలని.. వాటిని తీయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.
అందుకే టాలీవుడ్ హీరోలు మరియు దర్శకులు తమకు వస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ బాలీవుడ్ లో రాబోయే రోజుల్లో బిజీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ కు మన టాలీవుడ్ స్టార్స్ నుండి ఇప్పటికే తీవ్ర పోటీ ఉంది. అది భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.