మొత్తానికి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న, త్వరలో షూటింగ్ మొదలు కానున్న చిత్రాలన్నింటినీ తాత్కాలికంగా ఆపేయాలని టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తాజా సమావేశంలో నిర్ణయించారు. నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, అదే సమయంలో థియేట్రికల్ రెవెన్యూ బాగా తగ్గిపోవడంతో నిర్మాతల పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో.. పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూసి, సమస్యలకు ఆమోద యోగ్యమైన పరిష్కారం లభించాకే షూటింగ్స్ పున:ప్రారంభించాలని భావిస్తున్నారు.
కొవిడ్ తర్వాత అన్ని ధరలూ పెరిగినట్లే సినిమా నిర్మాణ ఖర్చులు కూడా అసాధారణంగా పెరిగిపోయాయి. సినీ కార్మికులు సమ్మెకు వెళ్లి మరీ తమ వేతనాలు పెంచుకున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్లు అంతకుముందే పెరిగిపోయాయి. దీని వల్ల మొత్తంగా నిర్మాణ ఖర్చు 30-40 శాతం పెరిగిపోయింది. కానీ నిర్మాతలకు రావాల్సిన ఆదాయం పెరగకపోగా.. ఇంకా తగ్గిపోవడంతో వారి కొంప మునుగుతోంది.
ఈ నేపథ్యంలో పారితోషకాలు అందరూ తగ్గించుకుంటే సినిమాల నిర్మాణం చాలా కష్టమన్న అభిప్రాయంతోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ నిలిపి వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఐతే సినిమాల ప్రొడక్షన్లో ప్రధానంగా ఎక్కువ వాటా ఉంటున్నది హీరోలు, దర్శకులదే. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు కలిసి సినిమా చేశారంటే సినిమా బడ్జెట్లో 60 శాతానికి పైగా వారి ఖాతాలోకే వెళ్తోంది.
టాలీవుడ్లో తెరకెక్కే ప్రతి పెద్ద సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. తమ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా హీరోలు కొత్త సినిమాకు పారితోషకాలు పెంచుకుంటూ పోతున్నారు. వారి డేట్లు సంపాదించేందుకు నిర్మాతలే పారితోషకాలు పెంచి ఆఫర్ చేస్తున్నారు. హీరోలు సినిమాకు పారితోషకం తీసుకోవడంతో పాటు కాల్ షీట్లు తమ సన్నిహితుల ఉన్నట్లు చెప్పి వారిని భాగస్వాములను చూసి అందుకు బదులుగా కొంత వాటా తీసుకోవడం, లేదా కాల్ షీట్లను నిర్మాతలు కొనేలా చేయడం ద్వారా కూడా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ల విషయానికి వస్తే.. చాలామంది నిర్మాతలను డమ్మీలుగా మార్చేసి ప్రొడక్షన్‌ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అన్నీ తామై వ్యవహరిస్తుండడంతో పారితోషకంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు.
ఇలా హీరోలు, దర్శకులకు ఇస్తున్న అసాధారణ పారితోషకాలు, వాటాల వల్లే నిర్మాణ ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్న మాట వాస్తవం. దాంతో పోలిస్తే మిగతా టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, కార్మికులకు ఇస్తున్నది తక్కువ. హీరోలు, దర్శకుల పారితోషకాలు తగ్గిస్తే చాలా వరకు భారం తగ్గిపోతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇది పిల్లి మెడలో గంట కట్టడం లాంటిది. పరిష్కారమేంటో తెలిసినా కూడా ఆ పని చేసే ధైర్యం ఉన్న నిర్మాతలు ఎందరన్నది ప్రశ్న?