రెండు..మూడేళ్లగా శృంగార తార సన్నిలియోన్ దక్షిణాది ఇండస్ర్టీ టార్గెట్ గా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి అటుపై పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ కొన్నాళ్ల పాటు ఓ వెలుగు వెలిగి మళ్లీ సౌత్ వైపు దృష్టి పెట్టింది. మలయాళంలో 'మధుర రాజా'లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తోంది.
ఈ క్రమంలో మాలీవుడ్ లో 'రంగీల' సినిమాతో లేడీ ఓరియేంటెడ్ నటిగా లాంచ్ అయింది. సన్ని బ్రాండ్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గని సినిమా ఇది . అటుపై సన్నిపై కోలీవుడ్ కన్ను పడింది. 'రంగీలా' తర్వాత వెంటనే సన్నీని లీడ్ రోల్ కి ఎంపిక చేసి 'వీరమ్ దేవి' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్లు బడ్జెట్ కేటాయించి నిర్మించారు.
సన్ని కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికే సంచలనమే. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఇదే ఊపు లో కోలీవుడ్ సన్నీతో 'ఓ మై ఘోస్ట్'..'షియారో' చిత్రాల్లో లీడ్ రోల్స్ కి ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆ రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అలా సన్ని బ్రాండ్ కోలీవుడ్ కి పాకుతోంది. ఈ నేపథ్యంలో సన్నిపై టాలీవుడ్ కన్ను కూడా పడిందా? అంటే అవుననే తెలుస్తోంది.
కొన్ని నెలలుగా సన్నిలియోన్ టాలీవుడ్ లో తిష్ట వేసిన సంగతి తెలిసిందే. ఓ పెద్దింటి సెలబ్రిటీ కుటుంబంతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఓ మెంబర్ గా కలిసి పోయింది. పాలు..నీళ్లంతా చనువు ఇప్పుడా ఇద్దరి మధ్య కనిపిస్తోంది. కలిసి భోజనం చేస్తారు. కలిసి సరదా వీడియోలు చేస్తారు. ఇలా ఎంతో స్నేహంగా మెలుగుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆకుటుంబం సన్నితో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు గుస గుస కూడా వినిపిస్తుంది. సన్నిలియోనికి వరల్డ్ వైడ్ గా ఉన్న గుర్తింపుని ఎన్ క్యాష్ చేసుకునే ప్లాన్ తో భారీ ప్రాజెక్ట్ వైపు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే సన్నితో సినిమా అంటే 100 కో ట్లు పైనే వెచ్చించే అవకాశం ఉంది.
అసలే తెలుగు సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్. అదీ సన్నితో సినిమా అంటే అంతకు మించి తక్కువ ఖర్చు చేస్తే తగదు. సన్ని బ్రాండ్ ఇమేజ్...టాలీవుడ్ రేంజ్ సరి తూగాలంటే ఆ మాత్రం ఖర్చు చేయాలి మరి. పక్కన నున్న కోలీవుడ్ నే సన్నిపై 100 కోట్లు పెట్టిందంటే? పాన్ం ఇండియాకి రీచ్ అయిన టాలీవుడ్ ఇంకెంత పెట్టాలి? అని ప్రశ్నించే వారు లేకపోలేదు మరి