జూన్, జూలై టాలీవుడ్ కు నైట్ మేర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ రెండు నెలల్లో రిలీజ్ అయిన సినిమాలు దాదాపుగా అన్నీ డిజాస్టర్ లుగా నిలిచిన ఇండస్ట్రీ వర్గాలని కలవరానికి గురిచేశాయి. ఇదే పరిస్థితి కొనసాగితే టాలీవుడ్ పరిస్థితి ఏంటి అంటూ చాలా మంది దర్శక నిర్మాతలు, హీరోలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టులో విడుదలైన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ లుగా నిలిచి ఊరట కలిగించాయి.
ఆగస్టు 5న విడుదలైన కల్యాణ్ రామ్ 'బింబిసార', దుల్కర్ సల్మాన్ 'సీతారామం' బ్లాక్ బస్టర్ లుగా నిలవడం.. ఆ తరువాత ఆగస్టు 13న విడుదలైన నిఖిల్ 'కార్తికేయ 2' దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో అది కూడా హిందీ బెల్ట్ లో భారీ స్థాయిలో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడంతో టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త జోష్ మొదలైంది. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలవడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడంతో అంతా హ్యాపీగా ఫీలయ్యారు.
టాలీవుడ్ మళ్లీ గాడిలో పడిందని సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తరువాత నుంచి మళ్లీ టాలీవుడ్ గాడి తప్పుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూడు సినిమాల తరువాత ఒకే ఒక్క మూవీ 'ఒకే ఒక జీవితం' సక్సెస్ బాట పట్టగా ఆ తరువాత వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ బోల్డ్ అవుతూ వెళుతోంది. సెప్టెంబర్ నెలలో విడుదలైన చాలా వరకు సినిమాలు డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.
సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మరీ దారుణంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇదే రోజు విడుదలైన కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' కూడా అదే బాట పట్టింది. ఇక కొరియన్ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' ఆధారంగా తెరకెక్కిన 'సాకిని డాకిని' డిజాస్టర్ అనిపించుకుంది.
రెజీనా, నివేదా థామస్ కలిసి నటించగా డి. సురేష్ బాబు, సునీత తాటి నిర్మించారు. సుధీర్ వర్మ రూపొందించిన ఈ మూవీ ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. దీంతో మళ్లీ టాలీవుడ్ వర్గాల్లో భయం పట్టుకుంది. ఇలాగైతే ఎలా అంటూ అంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 23న విడుదలవుతున్న నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' తో అయినా మారేనా లేక కింగ్ నాగార్జున 'ది ఘోస్ట్', చిరు 'గాడ్ ఫాదర్' రిలీజ్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అని ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.