సూర్య కథానాయకుడిగా `బ్రదర్స్` ఫేం కే.వి.ఆనంద్ రూపొందిస్తున్న తాజా చిత్రం `బందోబస్త్`. తమిళంలో కాప్పన్ పేరుతో తెరకెక్కింది. ఈ సినిమాని తమిళ్- తెలుగు సహా పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకూ రిలీజైన కాప్పన్ (బందోబస్త్ ) ట్రైలర్ ఆకట్టుకన్న సంగతి తెలిసిందే. బందోబస్త్ చిత్రంలో సూర్య గ్రేషేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఓవైపు రైతుగా .. మరోవైపు తీవ్రవాదిగానూ అతడు కనిపించనున్నాడని ట్రైలర్ రివీల్ చేసింది.
తాజాగా చెన్నయ్ లో కాప్పన్ ఆడియో వేడిక జరిగింది. ఈ వేడుక కోసం టాలీవుడ్ నుంచి దాదాపు పాతిక మంది జర్నలిస్టులు చెన్నయ్ కి వెళ్లారు. ఈ ఆదివారం ఉదయమే శంషాబాద్ నుంచి చెన్నయ్ కి జర్నలిస్టుల బృందం విమానయానం చేసింది. ఇందులోకేవలం సీనియర్ క్రిటిక్స్.. రిపోర్టర్లు మాత్రమే ఉన్నారు. ఫోటోగ్రాఫర్లు.. వీడియోగ్రాఫర్లకు ఆహ్వానం లేదు. ఈ ప్రయాణం కోసం లైకా సంస్థ లక్షల్లో ఖర్చు చేసిందట. విమాన ప్రయాణం.. కాస్ట్ లీ బసను జర్నలిస్టులకు ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ ని జెమిని -సన్ నెట్ వర్క్ ఎక్స్ క్లూజివ్ గా టెలీకాస్ట్ చేయనుందని తెలుస్తోంది.
చెన్నయ్ ఈవెంట్ కి ఇలా తెలుగు సినీజర్నలిస్టులు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో రూపొందించిన `రోబో` చిత్రం కోసం దాదాపు 30 మంది జర్నలిస్టుల్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత 2.0 ఆడియో వేడుక కోసం మరోసారి లైకా ప్రొడక్షన్స్ సంస్థ పెద్ద మొత్తంలో తెలుగు జర్నలిస్టుల్ని చెన్నయ్ కి ఆహ్వానించింది. ఈసారి కూడా లైకా సంస్థ సూర్య `బందోబస్త్` (కాప్పన్) కోసం తెలుగు జర్నలిస్టుల్ని ఆహ్వానించింది. ఆదివారం ఉదయం విమానంలో చెన్నయ్ వెళ్లిన జర్నలిస్టులు ఈరోజు 10 గంటలకు తిరుగు ప్రయాణం అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక చెన్నయ్ ఈవెంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ .. శంకర్ ముఖ్య అతిధులుగా పాల్గొని వేడుకను విజయవంతం చేశారట. చెన్నయ్ వెళ్లారు సరే.. అక్కడి నుంచి నాలుగు బకెట్ల నీళ్లయినా తెచ్చారా? అంటూ సినీజర్నలిస్టుల్లో సరదా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చెన్నయ్ నగరం ప్రస్తుతం తాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.