టాలీవుడ్ లో క్రేజీ బ్లాక్ బస్టర్లతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న దర్శకుల పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా మారింది. బ్లాక్ బస్టర్ హిట్ లతో క్షణం తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారనుకున్న వాళ్లలో కొంత మంది దర్శకులు స్టార్ హీరోలని నమ్మి ఏళ్లకు ఏళ్లు విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఒకే హీరో కోసం కళ్లు కాయలు కాసేలా దర్శకులు ఎదురుచూసిన తీరు చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కొన్నేళ్ల క్రితం `గబ్బర్ సింగ్` తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి పవన్ కల్యాణ్ తో కలిసి తనదైన మార్కులో భారీ సినిమాని చేయాలనుకున్నారు. `భవదీయుడు భగత్ సింగ్` అంటూ ఈ సినిమాకు టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. సినిమా ప్రకటించి దాదాపు రెండేళ్లవుతోంది. `గద్దలకొండ గణేష్` తరువాత హరీష్ ఈ మూవీ కోసం దాదాపు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.
కానీ పవన్ కల్యాణ్ మాత్రం జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని భారీగా ప్లాన్ చేసింది. పవన్ కు భారీ మొత్తం అడ్వాన్స్ గా కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమని తేలడంతో హరీష్ శంకర్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చుట్టూ తిరుగుతున్నాడు.
రెండేళ్ల శ్రమ, టైమ్ వృధా కావడంతో సల్మాన్ ఖాన్ అయినా కరుణిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఇదే తరహాలో `ఉప్పెన` డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ మూవీ తరువాత దాదాపు రెండేళ్ల పాటు ఎన్టీఆర్ కోసం ఎదురు చూశాడు. ఓ స్పోర్ట్స్ డ్రామాతో భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం, ఫైనల్ నరేష్ నచ్చకపోవడంతో బుచ్చిబాబు సాన రెండేళ్ల శ్రమ, టైమ్ వృధా అయిపోయింది.
ఇక ఈ దర్శకుల తరహాలోనే మరో యంగ్ డైరెక్టర్ పవన్ కల్యాణ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. `సాహో` మూవీతో భారీ సినిమాల డైరెక్టర్ల జాబితాలో చేరిపోయిన సుజీత్ అప్పటి నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. `గాడ్ ఫాదర్` కు ముందు సుజీత్ నే డైరెక్టర్ అనుకున్నారు. కానీ ఎందునో కుదరలేదు. ఆ తరువాత పవన్ కల్యాణ్ నుంచి ఆఫర్ వచ్చింది.
విజయ్ హీరోగా నటించిన `తేరీ`ని పవన్ తో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి సుజీత్ దర్శకుడు. అన్ని పనులు పూర్తయినా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సుజీత్ ఎదురుచూడక తప్పడం లేదు. వీరి దరహాలోనే చాలా మంది దర్శకులు స్టార్ హీరోల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి శ్రమ, టైమ్ కి విలు విచ్చే హీరోలు ఎప్పటికి వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.