క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేస్తే.. సంక్రాంతి నెక్ట్స్ వీక్ వరకు బోలెడు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఇందులో భారీ బడ్జెట్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే.. వీటిలో ఏ ఒక్క మూవీకి ఇప్పటివరకూ ఆడియో ఫంక్షన్ జరగకపోవడంతో.. టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా పాటల పండుగలు క్యూ కట్టేయనున్నాయి.
మొదట ఈ నెల 7న పూరీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ తో ఈ వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మెగా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం లేదని, ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతాడన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. లోఫర్ కి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఆ తర్వాత 12 వ తేదీన రామ్ - కీర్తి సురేష్ జంటగా నటించిన "నేను.. శైలజ.." ఆడియో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండడంతో.. ఆడియోపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రామ్ ఫంక్షన్ పూర్తైన మరుసటి రోజే.. అంటే డిసెంబర్ 13న గోపీచంద్ - రెజీనాలు నటించిన సౌఖ్యం ఆడియో వేడుక జరగనుంది. ఒంగోలులో ఫంక్షన్ నిర్వహించనుండగా.. అనూప్ రూబెన్స్ సౌఖ్యంకు ట్యూన్స్ ఇచ్చాడు. ఈ ప్రోగ్రాం కు బాలయ్య గెస్టుగా వెళుతున్నారని టాక్.
ఆ తర్వాత నందమూరి వారసుల పాటల వేడుకలు స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 20న - ఏపీ కేపిటల్ అమరావతిలో బాలయ్య 99వ చిత్రం "డిక్టేటర్" పాటలను రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ కోసం సంగీత దర్శకుడు థమన్ టెరిఫిక్ మ్యూజిక్ ఇస్తున్నాడంటున్నాని టాక్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు. డిసెంబర్ 23న కానీ - 25న కానీ సుకుమార్ డైరెక్షన్ లో జూనియర్ చేసిన నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల చేయనున్నారు. దీనికి కూడా సంగీతం అందించింది డీఎస్పీనే కావడం విశేషం. మొత్తానికి డిసెంబర్ నెల సంగీత ప్రియులకు మంచి ట్రీట్ అని చెప్పచ్చు.