ఏ సినిమా హిట్టో ఏ సినిమా ఫ్లాపో తెలియని అయోమయంలో పడిపోతున్నారు తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య. సోషల్ మీడియాలో ప్రచారాలు అలా ఉంటున్నాయి మరి. హిట్టు సినిమాను ఫ్లాప్ అని.. ఫ్లాప్ సినిమాను హిట్టని ప్రచారం చేయడం ఒక కన్ఫ్యూజన్ అయితే.. పెద్ద సినిమాలకు వేస్తున్న కలెక్షన్ల ఫిగర్లు మరో పెద్ద కన్ఫ్యూజన్.
బాక్సాఫీస్ వెబ్ సైట్లు ఒక్కోటి ఒక్కోలా కలెక్షన్ల వివరాలు ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను అయోమయానికి గురి చేస్తుంటే.. ఆయా చిత్రాల బృందాలు ప్రకటించే వసూళ్లు వివరాలు మరీ విడ్డూరంగా ఉండి జనాల్లో గందరగోళాన్ని ఇంకా పెంచుతున్నాయి.
ఓవైపు థియేటర్లు జనాల్లేక వెలవెలబోతుంటే.. మినిమం ఆక్యుపెన్సీ లేక షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటే.. మరోవైపేమో రోజుకు ఇన్ని కోట్లు అని కలుపుతూ కొత్త పోస్టర్లు దించుతుండటం చూసి అవాక్కవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి నిర్మాతలు రిలీజ్ చేసిన వసూళ్ల పోస్టర్లు చాలా అతిగా అనిపించాయి.
ఈ క్రమంలోనే ఫేక్ కలెక్షన్ల గురించి ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోందిప్పుడు. దీనికి అడ్డు కట్ట వేయకుంటే రేప్పొద్దున వాస్తవ వసూళ్లను ప్రకటించినా జనాలు అనుమానించే పరిస్థితి వస్తుందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఈ దిశగా అప్రమత్తం అయినట్లు కనిపిస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా మీడియా ఇంటర్వ్యూల్లో దీని గురించి స్పందించారు.
డిస్ట్రిబ్యూటర్లుగా తాము నిర్మాతలకు నిజమైన కలెక్షన్ల రిపోర్టే పంపిస్తామని.. ఐతే వసూళ్లను ప్రకటించడం వాళ్లు చూసుకుంటారని పేర్కొనడం ద్వారా ఇందులో ప్రొడ్యూసర్ల తప్పు ఉందని చెప్పకనే చెప్పాడు రాజు.
తెలుగు పరిశ్రమలో త్వరలో కలెక్షన్ల ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెప్పాడు. యుఎస్ లాంటి చోట్ల ఇలాంటి ట్రాకింగ్ సిస్టం వల్ల కలెక్షన్ల వివరాలు పక్కాగా ఉంటాయి. కానీ టాలీవుడ్లో ఇలాంటి ఒక పద్ధతి లేకపోవడం వల్ల ఎవరిష్టం వచ్చినట్లు కలెక్షన్లు వేసుకోవడం, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు మాటల్ని బట్టి చూస్తే ఈ కలెక్షన్ల కోతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది.