ప్రతీసారి ఒక కొత్త సినిమా వచ్చిందంటే.. ముందుగా మనకు వినిపించే గోల.. చిన్న సినిమాలకు ధియేటర్లు దొరకట్లేదని.. పెద్ద సినిమాలకు తెగ ధియేటర్లు ఇచ్చేస్తున్నారు. నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే 150 ధియేటర్స్ లో రిలీజైన ''క్షణం'' సినిమాను ఇప్పుడు దాదాపు 300 ధియేటర్లలోకి ప్రమోట్ చేయలేదా? దాని గురించి చాలా తక్కువమంది ఆలోచిస్తారంతే.
ఇకపోతే ఏప్రియల్ లో సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ సరైనోడు సినిమాలు వస్తున్నాయి. మే నెలలో అ..ఆ అండ్ బ్రహ్మోత్సవం వస్తున్నాయి. ఆల్రెడీ ఇబ్బందులు లేకుండా సర్దార్ సినిమా కోసం ఈరోస్ వారు ధియేటర్లతో భారీ ఎగ్రిమెంట్లే చేసుకున్నారు. బ్రహ్మోత్సవం సినిమా కూడా అంతే. నిర్మాత పివిపి ఆల్రెడీ ఊపిరి సినిమా కోసం ఇచ్చిన ధియేటర్లనే బ్రహ్మోత్సవం కోసం బ్లాక్ చేసి ఉంచారట. అవి కాకుండా ఎక్సట్రా ఎలాగో ఉంటాయి. సరైనోడు సినిమాను తీసిందే గీతా ఆర్ట్స్ వారు.. ఇక దిల్ రాజు అండ్ సురేష్ బాబు వీరికి ఆప్తులు. సో.. ధియేటర్లకు ఇబ్బందులు ఉండవు. ఎటొచ్చీ.. నితిన్ సినిమాకే కష్టాలన్నీ. నైజాంలో ఓకె కాని.. వేరే ఏరియాల్లో వీరు ధియేటర్లు ఎలా పడతారు అనే విషయంపైనే అందరి కళ్ళూ ఉన్నాయ్.
రెండు నెలల పాటు వీరు ఇలా ధియేటర్లను బ్లాక్ చేసేస్తుంటే.. ఇక మధ్యలో చిన్న సినిమాలు ఏమొస్తాయిలే. ఒకవేళ ఎవరన్నా మధ్యలో వస్తామంటే మాత్రం.. ఖచ్చితంగా ధియేటర్ స్ర్టోక్ తగులుతుందంతే.