సంక్రాంతి మూవీస్.. థియేటర్ కౌంట్ లో తేడాలు!

Update: 2023-01-15 05:30 GMT
సంక్రాంతి రేసులో ఈ సారిలో స్టార్ హీరోలు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ అనే నానుడి ఉంది. అందుకే పెద్ద హీరోలు అందరూ కూడా ఇదే సమయంలో తన సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అలా వచ్చిన వాటిలో కొన్ని సినిమాలు మొదటి రోజే డివైడ్ టాక్ తో రెండు రోజుల్లోనే చాప చుట్టేస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి తరువాత స్క్రీన్స్ సంఖ్య పెంచుకొని బిగ్ సక్సెస్ అందుకుంటాయి.

అలా సంక్రాంతి రేసులో పెద్ద హీరోలతో సమానంగా వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సంక్రాంతి రేసులో పెద్ద హీరోలు ముందువరుసలో ఉంటే వారికే ఎక్కువ థియేటర్స్ ని కేటాయిస్తారు. నిర్మాతకి ఉన్న బ్యాగ్రౌండ్ బట్టి, అలాగే హీరో స్టామినా బట్టి థియేటర్స్ లో ఆక్యుపై చేస్తారు. ఈ సారి తెలుగు రాష్ట్రాలలో కూడా సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

ఇక కోలీవుడ్ హీరో విజయ్ సినిమా కూడా టాలీవుడ్ లో భారీగానే రిలీజ్ అయ్యింది. దీనికి కారణం ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు కావడం ఒకటైతే, దర్శకుడు కూడా టాలీవుడ్ కి చెందిన వంశీ పైడిపల్లి కావడం మరో కారణం. ఈ రెండు కారణాలతో వారసుడు మూవీ కూడా తెలుగు సినిమా అనే రేంజ్ లోనే దిల్ రాజు ప్రచారం చేశారు. అయితే ముందు పెద్ద హీరోలకి ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలనే డిమాండ్ ఉండటంతో వాల్తేర్ వీరయ్య సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయించగా, తరువాత వీరసింహారెడ్డి, ఆ తరువాత వారసుడు సినిమాలు థియేటర్స్ ని ఆక్యుపై చేశాయి.

ఆ తరువాత స్థానంలో అజిత్ తెగింపు, సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన రిలీజ్ అయిన కల్యాణం కమనీయం సినిమాలకి థియేటర్స్ కేటాయింపు జరిగింది. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య 600 థియేటర్స్ లో నడుస్తుంది. వీరసింహారెడ్డి 450 థియేటర్స్ లో, వారసుడు మూవీ 350 థియేటర్స్ లో నడుస్తుంది. కల్యాణం కమనీయం 100 థియేటర్స్ లో, అజిత్ తెగింపు కేవలం 50 థియేటర్స్ లో నడుస్తుంది. తెలుగులో అజిత్ సినిమాలకి అంతగా మార్కెట్ లేకపోవడం, సినిమా కూడా డిజాస్టర్ కావడంతో మొదటి రోజు ఇచ్చిన థియేటర్స్ లో చాలా వరకు మెగాస్టార్ సినిమాకి కేటాయించేశారు. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులని ఎక్కువగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనేదానిపై ఆ సినిమాకి థియేటర్స్ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సినిమాలలో వాల్తేర్ వీరయ్య సినిమాకి ఎక్కువ బజ్ నడుస్తుంది. లాగ్ రన్ లో ఆ సినిమాకి థియేటర్స్ పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. 
Tags:    

Similar News