లోపల ఏం లేకపోయినా యాత్రలేనా??

Update: 2016-08-27 03:30 GMT
అప్పుడెప్పుడో హీరో విశాల్ ఒక మాటన్నాడు.. ''సినిమా ఫ్లాపైతేనే మినిమం మూడు సక్సెస్ మీట్లు పెడుతున్నాం. అటువంటిది హిట్టయ్యిందో.. ఇక చూస్కోండి..'' అంటూ ఒకానొక సందర్భంలో చెప్పాడులే. ఛ నిజమా? అంటూ చాలామంది అప్పుడు పెదవి విరిచారు కాని.. నిజంగా విశాల్ చెప్పిందే నిజం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి అలాగే ఉంది.

ఒక ప్రక్కన నిజంగా హిట్టయిన సినిమాలకు కూడా అన్నేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారో లేదో కాని.. డమ్మీ కథలతో రొటీన్ కథాంశాలతో బోరింగ్ సినిమాలు తీసినవారు మాత్రం.. ధియేటర్స్ టూర్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. రోజుకో ఊరు చేరుకుని.. అక్కడ ధియేటర్లలో సందడి చేస్తూ.. రచ్చ రచ్చ చేసేస్తున్నారు. కాని వాస్తవానికి వీరి సినిమాలకు పెట్టిన ఇన్వెస్టుమెంటు తిరిగిరాని పరిస్థితే ఉంది. అసలు ఉండాల్సిన కంటెంట్ లేకుండా ఇలా సక్సెస్ యాత్రలంటే ఎవరికి మాత్రం షాక్ కొట్టదు చెప్పండి? జనాలు అదే విషయంలో షాకింగ్ ఫేసు పెట్టి.. 'సినిమా బాలేద్ గదన్నా' అనే మాటను గట్టిగా అరిచి చెప్పాలని చూస్తున్నారట.

అదేంలేదులే కాని.. ఇలా ప్రమోట్ చేసుకోవడం తప్పేం కాదు. బట్ ఈ ఫోకస్ అంతా కంటెంట్ మీద కూడా పెట్టుంటే సినిమా ఔట్పుట్ ఇంకా బాగా వచ్చుంటే.. ఆ కిక్కే మరోలా ఉండేది కదా.
Tags:    

Similar News