గతేడాది పాండమిక్ టైంలో టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొచ్చింది డిసెంబర్ నెల అనే చెప్పాలి. అంతకముందు రెండు మూడు సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. ఈ నెలలో వచ్చిన "అఖండ" - "పుష్ప" లాంటి పెద్ద చిత్రాలు జనాల్లో వైరస్ పోయి థియేటర్లకు వచ్చేలా చేశాయి. ఫలితంగా భారీ వసూళ్ళు రాబట్టి.. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
అలాంటి డిసెంబర్ నెలను ఈసారి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. క్రిస్మస్ వంటి మంచి సీజన్ ఉన్నా.. వచ్చే ఏడాది ప్రారంభంలో సానుకూలమైన రిలీజ్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ముందుగా డిసెంబర్ లో లాక్ చేసుకున్న డేట్స్ ను కూడా వదులుకొని.. తమ చిత్రాలను వాయిదా వేసుకుంటున్నారు.
సంక్రాంతికి పెద్ద సినిమాల విడుదలలు ఉండటంతో.. జనవరిని వదిలేసి నేరుగా ఫిబ్రవరికి వెళ్లి పోతున్నారు. వాలెటైన్స్ వీక్ మరియు మహా శివరాత్రి ఫెస్టివల్ సీజన్ ను టార్గెట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఫిలిం మేకర్స్ రిలీజ్ డేట్స్ ని బ్లాక్ చేసుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న "అమిగోస్" చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 2న విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని 2023 ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న "సార్" సినిమా కూడా ఇదే బాటలో నడిచింది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2వ తేదీన తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
అలానే అల్లరి నరేష్ మరియు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వస్తున్న "ఉగ్రమ్" సినిమాని ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. ఇప్పుడు ఫిబ్రవరిలో మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారని సమాచారం.
ఇప్పటికైతే ఈ సినిమాలు ఫిక్స్ అవ్వగా.. అఖిల్ అక్కినేని "ఏజెంట్ " మూవీ కూడా ఫిబ్రవరికే షిఫ్ట్ అవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాని డిసెంబరును కాదని.. 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు సంక్రాంతి నుంచి తప్పించి, శివరాత్రికి తీసుకెళ్లే అవకాశం వుందని అంటున్నారు.
ప్రస్తుతానికి వచ్చే నెలలో అడివి శేష్ "హిట్ 2" మరియు రవితేజ "ధమాకా" చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మధ్యలో "అవతార్ 2" సినిమా కూడా వుంది. ఇవి కాకుండా మరికొన్ని చిన్న సినిమాలు - డబ్బింగ్ చిత్రాలు డిసెంబర్ నెలలో థియేటర్లలోకి రావాలని చూస్తున్నాయి.
అయితే ఈ సినిమాలన్నీ ఫిబ్రవరికి వెళ్ళడానికి కారణం.. మూవీకి హిట్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు రాకపోవడమే అనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన "గాడ్ ఫాదర్" "స్వాతిముత్యం" "ఓరి దేవుడా" వంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ ఇవేవీ బాక్సాఫీసు వద్ద ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే అప్పటికి ఆడియన్స్ మూడ్ మారుతుందేమో అనే ఆలోచనతో డిసెంబరు చిత్రాలను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.