టాలీవుడ్‌ కష్టాలు తీరతాయా?

Update: 2015-03-20 15:30 GMT
తెలుగు సినిమాలకు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఓవైపు విద్యార్థులంతా పరీక్షల్లో మునిగిపోయారు. మరోవైపు ప్రపంచకప్‌ మాయలో పడి మిగతా జనాలు థియేటర్లకు రావడమే మానేశారు. దీనికి తోడు వస్తున్న సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. గత నెల 'టెంపర్‌' తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. 'సూర్య వెర్సస్‌ సూర్య' కాస్త బెటర్‌ ఫిలిమే కానీ.. అది కూడా జనాల్ని సంతృప్తి పరచలేకపోయింది. గత వారం విడుదలై సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రెగ్యులర్‌గా సినిమాలు చూసే జనాలు సైతం ఈ సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దామని అనుకోవట్లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు వెలవెలబోతున్నాయి.

ఐతే సినిమాలకు కష్టకాలం ఇక ముగిసినట్లేనని.. ఉగాది నుంచి పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగించుకుని ఓ బ్యాచ్‌ బయటపడుతోంది కాబట్టి.. థియేటర్లు కొంచెం నిండొచ్చు. ప్రపంచ కప్‌ కూడా ముగింపు దశకు వస్తోంది. ఈ వారం వారాహి వారి 'తుంగభద్ర'తో పాటు నాని సినిమాలు ఎవడే సుబ్రమణ్యం, జెండాపై కపిరాజు థియేటర్లలోకి వస్తున్నాయి. చాన్నాళ్లుగా చెప్పుకోదగ్గ సినిమాల్లేని నేపథ్యంలో వీటికి థియేటర్లు బాగానే దొరికాయి. గురువారం ఇండియా మ్యాచ్‌ అయిపోతోంది. మళ్లీ సెమీస్‌ ఆడటానికి ఐదారు రోజుల టైం ఉంది. కాబట్టి థియేటర్లు మళ్లీ కళకళలాడుతాయని ఆశిస్తున్నారు. శనివారం ఉగాది కూడా కలిసొచ్చే అవకాశముంది. ఐతే ఇండియా సెమీస్‌లో గెలిచి ఫైనల్‌ చేరితే మాత్రం మళ్లీ కలెక్షన్లకు దెబ్బ పడుతుంది.

Tags:    

Similar News