ఇటు బాహుబలి.. అటు శ్రీమంతుడు

Update: 2015-07-29 17:36 GMT
ఓపక్క చూస్తే బాహుబలి ప్రభంజనం మూడో వారానికి కూడా తగ్గలేదు. బాహబలి వచ్చిన రెండు వారాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ సినిమా ‘జేమ్స్ బాండ్’ వచ్చింది కానీ.. దాని కంటే ముందు వచ్చిన బాహుబలికే ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయి. మూడో వీకెండ్లో కూడా దుమ్ముదులిపిన బాహుబలి.. తర్వాతి వీకెండ్లోనూ జోరు కొనసాగిస్తుందనడంలో సందేహాలేమీ లేవు. మరోవైపు ఆ తర్వాతి వారం శ్రీమంతుడు రెడీగా ఉన్నాడు. ఆ సినిమాకు కూడా క్రేజ్ పీక్స్ లో ఉంది. దీంతో ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. మంచు విష్ణు ‘డైనమైట్’ రేసులోంచి తప్పుకోవడంతో అన్నీ చిన్నా చితకా సినిమాలే విడుదలవుతున్నాయి.

ఈ వారం విడుదలయ్యే వాటిలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న సినిమా ‘మిర్చిలాంటి కుర్రాడు’. లయన్ ప్రొడ్యూసర్ రుద్రపాటి రమణరావు నిర్మించిన సినిమా ఇది. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ లయన్ అంటూ సినిమాను ప్రచారం చేసుకుటుంటం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. మరోవైపు జబర్దస్త్ ఫేమ్ ధన్ రాజ్ నిర్మాత మారి తీసిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ కూడా ఈ వారమే విడుదలవుతోంది. ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన ‘మంత్ర-2’కు కూడా ఈ వారమే మోక్షం కలుగుతోంది. కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ తమిళ హిట్ మూవీ ‘పాండవుల్లో ఒకడు’ను కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వీటిలో దేనికీ కూడా ప్రేక్షకుల్ని ఆకర్షించే శక్తి ఉన్నట్లు కనిపించట్లేదు. మరి ఒక్కటైనా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News