కామెంట్‌: టాలీవుడ్‌ వెళ్ళట్లేదంతే

Update: 2016-03-26 17:30 GMT
నిన్న రాజా చెయ్యి వేస్తే ఆడియో ఫంక్షన్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కామెంట్‌ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ర్టీ వారు ఎవరైనా కూడా ఏపిలో షూటింగ్‌ జరుపుకున్నా.. ఇక్కడ పరిశ్రమను అక్కడే ఏమన్నా ఎస్టాబ్లిష్‌ చేయలదలుచుకున్నా.. తగిన రాయితీలు ఇస్తాం అన్నారు. ఆయన అంత ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చినా కూడా అసలు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌ ను వదిలి వెళ్లిపోవడం అనేది మాత్రం జరగట్లేదు. వై సో?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. ఒకవేళ ప్రత్యేక తెలంగాణ వస్తే మాత్రం హైదరాబాద్‌ లో ఆంధ్రావాళ్ళ డామినేషన్‌ లో ఉన్న ఫిలిం ఇండస్ర్టీ ఖచ్చితంగా వైజాగ్‌ తరలి వెళ్లిపోతుంది అనుకున్నారు అందరూ. ఇక రూమర్ల విషయానికొస్తే.. మెగాస్టార్‌ చిరంజీవితో కలసి మినిష్టర్‌ గంటా శ్రీనివాసరావు వైజాగ్‌ దగ్గర మెగా ఫిలిం సిటీ కడతారని.. వేరే ప్రైవేటు బిల్డర్లతో కలసి నెల్లూరి దగ్గర సురేష్‌ బాబు కొత్త ఫిలిం సిటీ కడుతున్నారని.. స్వయంగా రామోజీరావే ఆంధ్ర ప్రాంతంలో మరో ఫిలిం సిటీ రూపొందిస్తారని వార్తలొచ్చాయి. కాని తెలంగాణ స్టేట్‌ వచ్చాక మాత్రం ఇవన్నీ వినిపించట్లేదు. కనిపించట్లేదు. అస్సలు టాలీవుడ్‌ ఎక్కడికో వెళ్తుందని ఎవ్వరికీ అనిపించట్లేదు.

దానికి కారణాలు అనేకం.. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెళ్లి రామోజీరావును కలవడం.. యంగ్‌ మినిస్టర్‌ కెటిఆర్‌ సినీ పరిశ్రమలో రామ్‌ చరణ్‌ వంటి హీరోలతో క్లోజ్‌ గా మెలగడం.. హైదరాబాద్‌ లో గతంలో సినీపరిశ్రమ పెద్దల తాలూకు ఆస్తులపై కన్నెర్రజేసిన హరీశ్‌ రావు వంటి వారు ఇప్పుడు వారితోనే హై ఫైవ్‌ లు కొట్టడం.. మొదలగు పరిణామాలన్నీ.. ఇక్కడ వాతావరణాన్ని స్విట్జర్లాండ్‌ కంటే కూల్‌ గా మార్చేశాయి. దానితో టాలీవుడ్‌ అసలు హైదరాబాద్‌ ను వదిలి వెళుతుంది అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే ఛాన్సు లేకుండా పోయింది.
Tags:    

Similar News