సెన్సార్ సర్టిఫికేషన్ ఇప్పుడు హాట్ టాపిక్కే. పలు మార్లు వివాదాల్లో చిక్కుకుంటుంటే.. కొందరు ఫిలిం మేకర్స్.. ప్రచారం కోసం ఉద్దేశ్యపూర్వకంగానే సెన్సార్ బోర్డును ఉపయోగించుకుంటున్న వైనం కూడా కనిపిస్తోంది. అయితే.. ఇప్పుడు ఓ సినిమాకి సెన్సార్ సర్టిఫికేషన్ కోసం లంచాలు కూడా ఇచ్చారనే టాక్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.
మరో రెండు వారాల్లో.. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఒక దానికోసం లంచాలు ఇవ్వాల్సి వచ్చిందట. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అయితే.. ఓ సినిమాను సెన్సార్ చేయించాలంటే.. నెల రోజుల ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణల కోసం అంటూ గత రెండు రోజుల వరకూ షూట్ చేస్తూనే ఉన్నారట. దీంతో సెన్సార్ కు సమయంలోగా దరఖాస్తు చేసుకోవడం కుదరలేదట. నిన్ననే అప్లికేషన్ పంపించి.. స్లాట్ బుక్ చేసుకున్నారని తెలుస్తోంది. కానీ ఇలా వెంటనే స్లాట్ దొరికేందుకు లంచాలు ఇచ్చారని అంటున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇచ్చారట. వీళ్ల అవసరాన్ని గుర్తించి అవతలి వాళ్లు బాగానే రాబట్టారని చెప్పుకుంటున్నారు.
అయితే.. ఇలా లంచాలు ఇచ్చినది సెన్సార్ బోర్డుకు కాదని టాక్. ప్రస్తుతం చాలామంది సెల్ ఫోన్స్ తో.. హ్యాండీ క్యామ్స్ తో సినిమాలు తీసేస్తూ.. తెగ అప్లికేషన్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి నుంచి ఆ స్లాట్ ను తీసుకునేందుకు.. వారు నో అబ్జక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎన్ ఓసీ కోసం లంచం ఇచ్చి.. త్వరలో విడుదల కానున్న సినిమాను సెన్సార్ లైన్ లో పెట్టారట. గత కొంతకాలంగా.. ఇలా స్లాట్ లను అమ్ముకుంటూ డబ్బు చేసుకుంటున్న వైనం పెరుగుతోందని సెన్సార్ సభ్యులు అంటున్నారు.