ఏ భాషకు చెందిన సినిమా ఇండస్ట్రీ అయినా 24 క్రాఫ్టులు ఉంటాయి. అందరూ అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయంతో ఉండడం ఎక్కడా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఒకే విభాగానికి చెందిన వారంతా ఒకమాట ఉండేందుకు.. ప్రయత్నాలు అయినా పక్క భాషల్లో కనిపిస్తాయి. కానీ అదేం విచిత్రమో.. తెలుగు విషయానికి వస్తే మాత్రం ఒకే క్రాఫ్ట్ నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు.
తెలుగు సినిమా చరిత్రలోనే వారం రోజులు థియేటర్లు మూత పడ్డ విషయాన్ని ప్రత్యేకంగా రాసుకోవాలి. అలాంటి సంఘటనకు కారణమైన ఓ వివాదం ఎట్టకేలకు తెరపడింది. ఇది జరుగుతుండగానే కొందరు మీడియాకెక్కి తోచిన కబుర్లు చెప్పేశారు. వీడియోలు తీసుకుని నెట్ లో పెట్టుకున్నారు. పెద్ద నిర్మాతలకు వచ్చిన నష్టమేమీ లేదంటూ.. ఓ చిన్న నిర్మాత ఆరోపిస్తున్నాడు. ఇంకొన్నాళ్లు సమ్మె చేసి అన్ని సమస్యలు పరిష్కరించాలనే సలహాను ఒకాయన తప్పు పట్టాడు. అంతా బాగానే ఉంది.. ఒప్పందం కుదిరిందని ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు నుంచి ఇన్నేసి మాటలు వినిపిస్తున్నాయి.
ఎప్పడూ ఎవరో ఒకరిని బ్లేమ్ చేసుకోవడం తప్ప.. నిజంగా నిజాయితీగా సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క క్రాఫ్ట్ అయినా ప్రయత్నిస్తుందా.. ఒక్క అసోసియేషన్ అయినా వర్క్ చేస్తుందా అంటే సమాధానం చెప్పడం కష్టమే సుమీ! ఇలాంటి అరుదైన ఫిలిం ఇండస్ట్రీ వాసులకు ఒక ఓయ్ వేస్కోవడంలో తప్పేమైనా ఉందా?.