చాలా సంవత్సరాలుగా తారల పారితోషికాల పెంపు వారి సిబ్బందికి భారీ చెల్లింపుల విషయంలో తెలుగు నిర్మాతల్లో కలత అలానే ఉంది. అయితే దీనికి పరిష్కారం కోసం ఏకంగా నెల రోజుల పాటు షూటింగులు ఆపేసి మరీ నిర్మాతల గిల్డ్- ఫిలింఛాంబర్-నిర్మాతల మండలి సారథ్యంలో 24 శాఖల అధిపతులు చర్చించారు. ఈ చర్చలు కూడా ఫలవంతం అయ్యాయి. ఇకపై స్టార్లు పారితోషికాలు కుదించుకోవాల్సిందేనని వారి వ్యక్తిగత స్టాఫ్ కి కచ్ఛితంగా వారే చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుందని కూడా తీర్మానించారు.
నిజానికి ఈ రూల్ ని బ్రేక్ చేయడానికి లేనే లేదు. కానీ ఇప్పుడు ఈ రూల్ కి ఒక డెబ్యూ నటి చెక్ పెట్టడం ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలకు తావిస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏమా కథాకమామీషు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
గత కొన్నేళ్లుగా అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేయనుందని కథనాలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ అది సాధ్యపడలేదు. ఏడాది కాలంగా జూ.ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ సినిమాతోనే జాన్వీ ఎంట్రీకి అవకాశం ఉందని కూడా కథనాలొచ్చాయి. ఒకానొక సందర్భంలో తనని ఎవరూ సంప్రదించలేదని... ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ సరసన అవకాశం వస్తే నటించేందుకు తాను సిద్ధమేనని జాన్వీ హింట్ కూడా ఇచ్చింది.
దీంతో కొరటాలతో ఎన్టీఆర్ 30 కోసం జాన్వీ మంతనాలు సాగించలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ జాన్వీ కపూర్ ఈ చిత్రానికి సంతకం చేసేందుకు ఇంకెంతో సమయం పట్టదని తెలిసింది. అయితే జాన్వీ ఈ మూవీకి సంతకం చేయడానికి కారణం భారీ పారితోషికం డిమాండ్ ని నెరవేర్చడంతో పాటు తన వ్యక్తిగత సిబ్బందికి అవసరమైన చెల్లింపులు చేసేందుకు మేకర్స్ దిగి రావడం కూడా ఒక కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి ఒప్పించాలని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు. ప్రతిదీ నిర్మాతలు ధృవీకరించాల్సి ఉంటుంది.
ఏది ఏమైనా తనకోసం టాలీవుడ్ ఎదురు చూసేలా సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగడంలో జాన్వీ మంత్రాంగం ఫలిస్తోందని చెప్పాలి. ఇటీవల వరుసగా వేడెక్కించే ఫోటోషూట్లతో షో స్టాపర్ గా నిలుస్తున్న జాన్వీ పై మన దర్శకనిర్మాతలు కన్నేశారు. బాలీవుడ్ లో ఒక్కో విజయంతో నటిగాను నిరూపించుకున్న ఈ బ్యూటీని టాలీవుడ్ కి రప్పిస్తే ఆ మేరకు పాన్ ఇండియా ప్లాన్ కి కూడా అదనపు బూస్ట్ ఇస్తుందనేది మేకర్స్ ఆలోచన. అందుకే భారీ ప్యాకేజీ చెల్లించి అయినా జాన్వీ కపూర్ ని బరిలోకి దించే ప్లాన్ లో కొరటాల అండ్ టీమ్ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎన్టీఆర్ 30 స్క్రిప్టు కాన్వాసు మారాయి. దానికి తగ్గట్టే బాలీవుడ్ నాయిక అవసరం తప్పనిసరి. జాన్వీ డెబ్యూ సినిమా అయితే అతిలోక సుందరి తెలుగు అభిమానుల్లోను బోలెడంత క్యూరియాసిటీ నెలకొంటుందనడంల సందేహం లేదు. దానిని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ క్యాష్ చేయడం కూడా సులువు. అలాగే ఆర్.ఆర్.ఆర్ తర్వాత బాలీవుడ్ లోను ఎన్టీఆర్ కు జాన్వీ జతగా కలిస్తే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంటుందని ప్లాన్ చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ జాన్వీ కోసం ఎన్టీఆర్ 30 నిర్మాతలు రూల్స్ ని బ్రేక్ చేస్తే గనుక విమర్శలు ఎదుర్కోక తప్పదు. అలాగే డిమాండ్ - సప్లయ్ సూత్రం ప్రకారం లేదా క్రేజ్ ఫ్యాక్టర్ లేదా మార్కెట్ గణాంకాలు అనే కారణంతో రూల్ ని బ్రేక్ చేస్తున్నారని భావించాల్సి ఉంటుంది. కారణం ఏదైనా జాన్వీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నందుకు ఎన్టీఆర్ చిత్రబృందానికి ఇది సవాల్ అని చెప్పాలి.
ఫిబ్రవరి 2023లో చిత్రీకరణ ప్రారంభం కానున్న కొరటాల శివ - ఎన్టీఆర్ నటించిన #NTR30 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ట్రయల్ కోసం భారీ ప్రయోగం చేయబోతున్నారు. కథానాయిక ఎంపిక ఇప్పటికే ఆలస్యమైంది. అందుకే త్వరగా జాన్వీకి అడ్వాన్స్ మొత్తం చెల్లించి అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. సాధారణంగా జాన్వీ బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి రూ.4 నుంచి 6 కోట్ల మధ్య వసూల్ చేస్తోంది. అంత పెద్ద మొత్తాన్ని తెలుగు డెబ్యూ మూవీ కోసం నిర్మాతలు చెల్లిస్తున్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.
వచ్చే నెలలో ప్రారంభోత్సవం ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. వచ్చే నెలలో సినిమాను ప్రారంభించి ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత తనని తాను రీబూట్ చేసుకునేందుకు.. తన స్నేహితుడు ఎన్టీఆర్ కి అసాధారణమైన `పాన్ ఇండియా స్టార్ డమ్` ని అందించేందుకు కొరటాల తాజా ప్రాజెక్ట్ ని సవాల్ గా స్వీకరించాడన్న చర్చా సాగుతోంది. ఇది అతడిపై ఒత్తిడిని పెంచుతుందనడంలో సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.