ఒకానొక సమయంలో హెవీ కాంపిటీషన్ ల మధ్య తమతమ సినిమాలను విడుదల చేసి విజయాలను అందుకున్న ఘనత చిరు - నాగ్ - వెంకీ మరియు బాలయ్యది. అయితే ఇప్పుడు వారు సీనియర్ హీరోలుగా మారిపోయి అడపాదడపా సినిమాలతో కాకుండా ఆచి తూచి చిత్రాలు చేస్తున్నారు.
చిరు 150వ చిత్రంకోసం దశాబ్ద కాలంగా ఆలోచిస్తూనే వుండడం, బాలయ్య అప్పుడప్పుడు మెరుస్తూ వందవ సినిమాకు దగ్గరవడం, వెంకీ రీమేక్ చిత్రాలతో, మల్టీ స్టారర్ సినిమాలతో సరిపెట్టుకోవడంతో వీరిమధ్య ఆరోగ్యకరమైన పోటీ కరువయింది. అయితే నాగార్జున మాత్రం తనదైన పంధాలో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ తన స్టామినాని ప్రూవ్ చేసుకుంటున్నాడు.
ఈ ఏడాదిలో రెండు విజయాలు సాధించిన ఏకైక హీరోగా నాగార్జున ఇప్పటికే రికార్డు సృష్టించాడు. సోగ్గాడే చిన్ని నయనా - ఊపిరి సినిమాలలో తన నటనతో అందరినీ విస్మయపరిచాడు. తన తోటి హీరోలకే కాక నేటి తరం కుర్ర స్టార్లకు సైతం కింగ్ ఊపిరి పీల్చుకోనివ్వడంలేదన్నది సరైన కామెంట్